‘ఇలియనా’ సైజులో వస్తున్న ‘డెల్ ల్యాపీ’ ..!!

Posted By: Staff

‘ఇలియనా’ సైజులో వస్తున్న ‘డెల్ ల్యాపీ’ ..!!

బరువు తక్కువ సాంకేతిక పరికారాలకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా గ్యాడ్జట్ల తయారీ సంస్థలు స్లిమ్ పరికరాలను డిజైన్ చేస్తున్నాయి. ఈ కోవలోనే ‘డెల్’ సరికొత్త స్లీక్ డిజైన్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయునుంది. ‘డెల్ ఇన్స్‌పిరాన్ 13z’గా విడుదల కాబోతున్న ఈ ల్యాపీని రెండు ప్రొసెసర్ కాన్ఫిగరేషన్ ఆప్షన్లలో విడుదల చేస్తున్నారు. వినియోగదారుడు తన అవసరాన్ని బట్టి ఇంటెల్ కోర్ i3 లేదా i5 ప్రొసెసింగ్ వ్యవస్థలను ఎంపిక చేసుకోవచ్చు. 13.3 అంగుళాల వెడల్పు హై డెఫినెషిన్ స్ర్కీన్ డిస్‌ప్లేతో పాటు టిఎఫ్టీ వ్యవస్థ ల్యాపీలో దర్శనమిస్తుంది.

అనుసంధానించిన 1.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్ వినియోగదారునికి ఉపయుక్తంగా నిలుస్తుంది. డెల్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ ‘తాము ప్రవేశపెట్టిన ‘ఇన్స్ పిరాన్ 13z’ డెల్ పరికరాల్లో అత్యుత్తమంగా నిలుస్తుందిని ధీమా వ్యక్తం చేశారు. నిరంతాయంలేని ‘కనెక్టువిటీ వ్యవస్థ’ను కోరుకునే వారికి ఈ ల్యాపీ లాభదాయకంగా ఉంటుందని అన్నారు.

ఇక ల్యాపీ బరువు విషయానికి వస్తే ‘1.76’ కేజీలు ఉంటుంది. 4 సెల్ 37 WHr లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థను ఇందులో పొందుపరిచారు. ఈ బ్యాటరీ వ్యవస్థ సామర్ధ్యం అదనంగా 6 గంటులు కలిగి ఉంటుంది. ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే ‘ఇన్స్‌పిరాన్ 13z’ 4జీబీ ర్యామ్, 320 జీబీ హార్డ్ డిస్క్ కలిగి ఉంటుంది. మీడియా కార్డ్‌రీడర్‌ను అదనంగా పొందుపరిచారు. అప్‌డేటడ్ వర్షన్ల కనెక్టువిటీ డివైజులను కంపెనీ ఎంపిక చేసింది. ప్రధానంగా డివైజ్‌లో పొందుపరిచిన వై - ఫై వ్యవస్థ శక్తివంతమైన సామర్ధ్యం కలిగి నమ్మకమైన పనితీరును వినియోగదారునికి అందిస్తుంది. ఈ ల్యాపీలో మరో ప్రత్యేకత బ్లూటూత్ వ్యవస్థ. ఈ పరికరంలో పొందుపరిచిన 3.0 డివైజ్ డేటా ట్రాన్స్‌ఫర్ తదితర అంశాలను వేగవంతంగా నడిపిస్తుంది.

ఇపిల్ ‘మ్యాక్‌బుక్’ పేరుతో స్లీక్ డిజైన్లతో రూపొందించిన గ్యాడ్జెట్లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ‘డెల్ ఇన్స్‌పిరాన్ 13z’కు గట్టి పోటీ ఎదుర్కొక తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ‘13z’ ప్రపంచ మార్కెట్లో తాజా మైలు రాయిని అధిగమించవచ్చని అంచనాలు ఊపందుకున్నాయి. చివరిగా ధర విషయానికి వస్తే భారతీయ మార్కెట్లో ఈ ల్యాపీ రూ. 35955కి లభించవచ్చన్న వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot