డెల్ కొత్త ల్యాప్‌టాప్.. ‘XPS 15’

|

ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కంపెనీ డెల్, XPS 15 పేరుతో సరికొత్త ప్రీమియమ్ నోట్‌బుక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ నోట్‌బుక్‌ను డెల్ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు డెల్‌ ఎక్స్‌‍క్లూజివ్ స్టోర్స్‌లలో విక్రయించనున్నారు.

 
డెల్ కొత్త ల్యాప్‌టాప్.. ‘XPS 15’

క్రోమాతో పాటు రిలయన్స్ డిజిటల్ అవుట్‌లెట్‌లలోనూ ఈ ల్యాపీ అందుబాటులో ఉంటుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.1,17,989. హై-ఎండ్ వేరియంట్ ధర రూ.1,43,990. XPS 15ను మార్కెట్లో లభ్యమవుతోన్న అతిచిన్న 15-ఇంచ్ ల్యాప్‌టాప్‌గా డెల్ అభివర్ణించింది.

1.8 కిలోగ్రాములు బరువుతో వస్తోన్న ఈ ల్యాపీ, 15 అంగుళాల డిస్‌ప్లే క్యాటగిరి విభాగంలో లైటెస్ట్ ల్యాప్‌టాప్‌గా నిలుస్తుందని డెల్ చెబుతోంది. బీజిల్-లెస్ ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్‌ప్లేతో పాటు 170 డిగ్రీల వైడ్-వ్యూవింగ్ యాంగిల్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

100% Adobe RGB colour gamutతో వస్తోన్న మొట్టమొదటి ల్యాప్‌టాప్ కూడా ఇదే కావటం విశేషం.
ఈ ఫీచర్ sRGBతో పోలిస్తే విస్తృత శ్రేణి రంగులను ఆఫర్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌కు టచ్‌స్ర్కీన్ ఫీచర్ మరో ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.

ఎదురులేని షియోమికి పెద్ద షాక్, రేపు ముహూర్తం పెట్టిన నోకియా !ఎదురులేని షియోమికి పెద్ద షాక్, రేపు ముహూర్తం పెట్టిన నోకియా !

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే... XPS 15 ల్యాప్‌టాప్ క్వాడ్-కోర్ ఇంటెల్ కోర్ i7-7700 HQ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3.8 GHz. 4 GB NVIDIA GeForce GTX 1050 జీపీయూ చిప్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది.

మొత్తం నాలుగు కాన్ఫిగరేషన్‌లలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది. యూజర్ తన అవసరాన్ని బట్టి 16జీబి ర్యామ్, 512జీబి SSD స్టోరేజ్ వరకు కాన్ఫిగరేషన్‌ను సెలక్ట్ చేసుకునే వీలుంటంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఏకంగా 19 గంటల 30 నిమిషాల బ్యాకప్‌ను ఈ ల్యాప్‌టాప్ ద్వారా ఆశించవచ్చని డెల్ చెబుతోంది.

ఈ ల్యాప్‌టాప్‌లో ఎక్విప్ చేసిన Waves MaxxAudio Pro టెక్నాలజీ హైడెఫిపిషన్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని డెల్ స్పష్టం చేసింది. మిరుమిట్లు గొలిపే బ్యాక్‌లైట్ కీబోర్డ్, మరింత ఖచ్చితత్వంతో పనిచేసే టచ్‌ప్యాడ్‌లు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళతాయని డెల్ చెబుతోంది.

ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వస్తే.. డెల్ ఎక్స్‌పీఎస్ 15 ల్యాప్‌టాప్‌లో రెండు USB 3.0 పోర్ట్స్‌తో పాటు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, కిల్లర్ 1535 వైర్‌లెస్ - ఏసీ అడాప్టర్ ఇంకా బ్లుటూత్ సౌకర్యాలతో వస్తోంది. ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసిన Thunderbolt 3 పోర్ట్ ద్వారా ఏకకాలంలో చార్జింగ్ అవసరాలను తీర్చుకోవటంతో పాటు మల్టిపుల్ డివైస్‌లకు కనెక్ట్ అయ్యే వీలుంటుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Dell launches XPS 15 notebook with world’s first InfinityEdge display in India at Rs. 1,17,990

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X