భారత్‌లోకి డెల్ కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లు

Posted By:

డెల్ కంప్యూటర్లకు భారతీయ మార్కెట్లలో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. తాజాగా డెల్, వోస్ట్రో 15 3000 సిరీస్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ సిరీస్ ప్రారంభ మోడల్ ధర రూ.30,090. డెల్ వోస్ట్రో 3546 మోడల్ తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. వోస్ట్రో 3546 ల్యాప్ టాప్ 4 రకాల ప్రాసెసర్ వేరియంట్ లలో లభ్యమవుతోంది. ఆ వివరాలు.. ఇంటెల్ సెలిరాన్ 2975యూ వేరియంట్, 4వ తరం ఇంటెల్ కోర్ ఐ3-4005యూ వేరియంట్, కోర్ ఐ3-4030యూ వేరియంట్, కోర్ ఐ5-4210యూ వేరియంట్.

భారత్‌లోకి డెల్ కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లు

ఇంటెల్ సెలిరాన్ 2975యూ వేరియంట్ ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ ప్రాససర్‌ను కలిగి ఉంటుంది. ఇంటెల్ కోర్ ఐ3, కోర్ ఐ5 వేరియంట్‌లు ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి.

డెల్ వోస్ట్రో 3546 ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు:

యాంటీ గ్లేర్ కోటింగ్‌తో కూడిన 15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), మీ ఎంపికను బట్టి ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ 8.1 ప్రో 64 బిట్, విండోస్ 8.1 ప్రో చైనా 64 బిట్, విండోస్ 8.1 64 బిట్, విండోస్ 8.1, లైనక్స్ ఉబుంటూ), 4జీబి డీడీఆర్ఎల్3 ర్యామ్ ( కాన్ఫిగరేషన్‌ను బట్టి 8జీబి వరకు పెంచుకునే అవకాశం), 500జీబి నుంచి 1 టాబ్ వరకు 500 ఆర్‌పీఎమ్ సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్, 1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్, వేవ్ మాక్స్ ఆడియో సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసిన స్టీరియో స్పీకర్లను డెల్ వోస్ట్రో 3546 ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసారు. కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ వీ4.0), ల్యాపీ పరిమాణం 25.6x381.4x267.5మిల్లీ మీటర్లు, బరువు 2.38 గ్రాములు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot