‘డెల్ వర్క్ స్టేషన్’ రేంజ్ ఏంటో తెలుసుకుంటే..?

Posted By: Super

‘డెల్ వర్క్ స్టేషన్’ రేంజ్ ఏంటో తెలుసుకుంటే..?


‘‘సాంకేతిక పరికరాల పోరులో ఎంతటికైన సిద్ధమంటూ సవాల్ విసిరే ‘డెల్’ మరో సారి తన సత్తాను చాటుకుంది. దిగ్గజ బ్రాండ్ తాజాగా విడుదల చేసిన వర్క్ స్టేషన్ ‘డెల్ ప్రిసిషన్ M600’ కాన్ఫిగరేషన్‌ను పరిశీలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సాధరాణంగా వర్క్ స్టేషన్లను వీడియో ప్రొడక్షన్, ఇంజనీరింగ్, జియోలజీ, క్యాడ్ సంబంధిత విభాగాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా డెల్ రూపొందిచిన ‘వర్క్ స్టేషన్’ శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంది.’’

క్లుప్తంగా ఫీచర్లు:

- స్లేషన్‌లో అనుసంధానించిన జంట హార్డ్ డిస్క డ్రైవ్‌లు 250జీబీ, 750జీబీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.
- మెమరీ వ్యవస్థను 8జీబీ నుంచి 32 జీబీ వరకు ఎక్సటర్నల్ స్లాట్ విధానం ద్వారా వృద్థి చేసుకోవచ్చు.
- అత్యంత వేగవంతమై సెకండ్ జనరేషన్ కోర్ i7 ప్రొసెసింగ్ వ్యవస్థను స్లేషన్‌లో ఏర్పాటు చేశారు.
- 17.3 అంగుళాలు సైజు కలిగిన స్ర్ర్కీన్ మల్టీ టచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
- హై డెఫినిషన్ నాణ్యతతో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే స్క్రీన్ ఆడోబ్ ఆర్జీబీ గామెట్ ( Adobe RGB gamut) వ్యవస్థను కలిగి ఉంటుంది.
- పొందుపరిచిన వైర్ లెస్ కనెక్లువిటీ వ్యవస్థ 802.11 b/g/n వైమ్యాక్స్ (WiMax) 3జీ, జీపీఎస్ వ్యవస్లలను వేగవంతంగా నడిపిస్తుంది.
- సెక్యూరిటీ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థ వర్క్ స్టేషన్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది.
- టీపీఎమ్ చిప్, న్విడియా ఆప్లిమా 4000ఎమ్ గ్రాఫిక్ వ్యవస్థలు ప్రత్యేక పనితీరును కనబరుస్తాయి.
- బ్యాక్ లిట్ కీ బోర్డు, ఏర్పాటు చేసిన యూఎస్బీ పోర్టులు, హెచ్డీఎమ్ఐ, ఎన్జీఏ, జిగాబిట్ ఇతర్‌నెట్, డీవీడీ బర్నర్, ఆప్షనల్ బ్లూరే డ్రైవ్, ఎస్టీ కార్డర్ వంటి వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ది చేకూరుస్తాయి.
- వినయోగదారుని ఆసక్తికి అనుగుణంగా వివిధ కాన్ఫిగరేషన్లలో లభ్యమవుతున్న ‘డెల్’ వర్క్ స్టేషన్ల ధర రూ. 95,266 నుంచి మొదలవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot