డెల్ మరో ప్రయత్నం ‘స్ట్రీక్ 10’..

Posted By: Super

డెల్ మరో ప్రయత్నం ‘స్ట్రీక్ 10’..

కంప్యూటింగ్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న ‘డెల్ ’ మరో అస్త్రాన్ని సంధించనుంది. వినూత్న ప్రయోగంతో ‘డెల్ స్ట్రీక్ 10’ అనే టాబ్లెట్ పీసీని ప్రవేశపెట్టనుంది. అతి త్వరలోనే ఇవి భారతీయ మార్కెట్‌ను తాకనున్నాయి. శక్తివంతమైన T25 Tegra 2 siliconతో రూపొందింపబడిన ‘డెల్ స్ట్రీక్ 10’, ఆండ్రాయిడ్ 1.2 GHz ప్రాసెసర్ తో పనిచేస్తుంది. వినియోగదారులు.. ఏ మాత్రం శంకోనించనవసరంలేదు, ఎందుకంటే డెల్ స్ట్రీక్ 10లో పొందుపరిచిన ఆండ్రాయిడ్ వ్యవస్థ మన్నికతో పాటు వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది. ఈ మధ్య విడుదలైన 10 అంగుళాల డిస్‌ప్లే టాబ్లెట్ పీసీలు అటు వెబ్ బ్రౌజింగ్ పాటు ఇటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా అరచేతిలో రుచిచూపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో విడుదలకాబోతున్న ‘డెల్ స్ట్రీక్ 10’ గట్టి పోటీ నిస్తుందిని విశ్లేషకుల అంచనా. గొరిల్లా గ్లాస్‌తో రూపొందించిబడిన డిస్‌ప్లే ‘ క్రిస్టల్ సిల్వర్ స్ర్కీన్ ఎఫెక్ట్ ’ నిస్తుంది, అంతే కాకుండా ప్రమదావశాత్తూ టాబ్లెట్ కిందపడిన స్ర్కీన్‌కు ఎటువంటి నష్టం వాటిల్లదు. రియల్టీగా ఫీలయ్యే గేమింగ్ అనుభూతిని ఈ డెల్ స్ట్రీక్ 10 టాబ్లెట్ ద్వారా పొందవచ్చు. ఇక మెమరీ విషయానికి వస్తే 32 జీబీకి పెంచుకోవచ్చు. ‘డెల్ స్ట్రీక్ 10 లో కేవలం ఎంటర్ టైన్ మెంట్, వెబ్‌బ్రౌజింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందంటే పొరపాటే...అద్భతమైన కెమెరాను కూడా ఇందులో పొందుపరిచారు.

LED flash సౌలభ్యంతో రూపొందింపబడిన 5 మోగా పిక్సల్ కెమెరా నాణ్యమైన చిత్రాలతో, మధుర జ్ఞాపకాలను వీడియో రూపంలో రికార్డు చేసుకునేందుకు ఉపకరిస్తుంది. అంతేకాదండోయ్.. డెల్ స్ట్రీక్ 10 ద్వారా మిత్రులతో వీడియో ఛాటింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు సహచరులతో వీడియో కాన్ఫిరెన్స్ కూడా నిర్వహించుకోవచ్చు. ఇందు కోసం 2 మోగా పిక్సల్ కెమెరా టాబ్లెట్ ముందు భాగంలో అమర్చి ఉంటుందట. డేటా మేనేజిమెంట్‌కు సంబంధించి కావల్సిన సౌలభ్యతలన్ని ‘డెల్ స్ట్రీక్ 10’లో పొందుపరిచారు.

తక్కువ వ్యవధిలో సంబంధిత డేటాను బ్లూటూత్, USBల సాయంతో పంపవచ్చు. అనుసంధానించబడిన శక్తివంతమైన వై - ఫై , హై స్పీడ్ మొబైల్ వెబ్ సౌలభ్యాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ‘డెల్ స్ట్రీక్ 10’కి అమర్చబడిన శక్తివంతమైన బ్యాటరీ 10 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అందరిని ఆకట్టకునే విధంగా ‘డెల్ స్ట్రీక్ 10’ టాబ్లెట్ పీసీ ధరను మార్కెట్లో రూ.21,000లకు నిర్థారించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot