డెల్ కొందామా..? సోనీ కొందామా..?

By Super
|
Dell Streak 10-Sony S1
ఆ రెండు అత్యుత్తమ బ్రాండ్లె.. కంప్యూటింగ్ వ్యవస్థలో ఆరితేరిన దిట్టలే... అనేక సాంకేతిక పరికరాలను మార్కెట్‌కు పరిచయం చేసిన ఘనాపాటిలే.. అయితే ఈ బ్రాండ్ల మధ్య పరస్పరం పోటీ నెలకుంటుంది. గత కొంత కాలంగా మార్కెట్లో టాబ్లెట్ పీసీల జోరు ఊపందుకోవటంతో ఈ రెండు బ్రాండ్లు టాబ్లెట్ల తయారీ పై దృష్టి సారించాయి. ఈ నేపధ్యంలో డెల ‘స్ట్రీక్ 10’ పేరుతో టాబ్లెట్ పీసీని 135 క్రితం మార్కెట్లో విడుదల చేసింది. అయితే సోనీ మాత్రం S1 tablet పేరుతో ఓ కొత్త టాబ్లెట్‌ను మరో 25 రోజుల్లో మార్కెట్లో విడుదలు చేసుందుకు సన్నాహాలు చేస్తుంది.

విడుదలై మార్కెట్లో అమ్ముడవుతున్న ‘Dell Streak 10’, కోటి ఆశలతో విడుదలకాబోతున్న ‘Sony S1 tablet’ మధ్య తారతమ్యాలను ఓ సారి పరిశీలిద్దాం. తొలిగా వీటి display, designల ఏ రేంజ్ లో ఉన్నాయో చూద్దాం. 5 inches 800x480 TFT డిస్‌ప్లే సామర్ధ్యం కలిగిన ‘Dell Streak 10’ మొబైల్ వెబ్ డిజైనింగ్, వీడియో ఫెసిలటీ వంటి అంశాలను సమర్ధవంతగా రూపొందిస్తుంది. ఇక సోనీ ‘S1 tablet’ విషయానికి వస్తే 9.4 inch వెడల్పు display కలిగి, 1280x768 రిసల్యూషన్ కలిగి ఉంటుంది. టచ్ స్ర్కీన్ సౌలభ్యం కలిగిన ఈ టాబ్లెట్ TFT 159PPI technologyని వొదిగి ఉంది.

ఇక operating system విషయాలకు వస్తే, ఈ రెండు టాబ్లెట్లలో android ఆపరేటింగ్ వ్యవస్థే విధులు నిర్వహిస్తుంది. ‘Dell Streak 10’లో ఆండ్రాయడ్ వర్షన్ v2.2 Froyo support చేస్తే, ‘Sony S1 tablet’లో సరికొత్త ‘honeycomb flash 10.3 android version’ను పొందుపరిచారు.

ఇక processorల విషయానికి వస్తే ఈ రెండుంటిలో వేరుగా ఉంటాయి. ‘Sony S1 tablet’లో సరికొత్త NVDIA Tegra 250 dual core processor, 1 GHzని అమర్చగా, ‘Dell Streak 10’లో Snapdragon S1 processor, 1 GHzను పొందుపరిచారు. అయితే ఈ రెండు ప్రాసెస్సర్ల పనితీరును పరిశీలిస్తే S1 tabletలలో పొందుపరిచిన NVDIA Tegra 250 dual core processor అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఇక ‘Sony S1 tablet’లో పొందుపరిచిన కొన్ని ప్రత్యేక ఫీచర్లు ‘Dell Streak 10’ని dominate చేస్తాయి. ప్రత్యేకంగా మ్యూజిక్ విషయంలో సహజసిద్ధమైన అనుభూతిని మీరు Sony S1లో పొందగలగుతారు. ఎందుకంటే S1లో పొందుపరిచిన అధునాతన Sony Qriocity Platform నాణ్యమైన ఆడియోను మీకు అందించేందుకు ఉపకరిస్తుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలలో ఏమాత్రం రాజీపడిని Sony S1 గేమింగ్ విషయంలో ప్రత్యేక చొరవతీసుకుంది. ‘S1 tablet’లో ముందుగానే అమర్చిన pre loaded gameలను, ప్లే స్టేషన్ 1, ప్లే స్టేషన్ 2ల ద్వారా మీరు ఎంజాయ్ చేయెచ్చు.

Connectivity, data transfer విషయాలకొస్తే ‘S1 tablet’ ఖచ్చితమైన వేగంతో స్పందిస్తుంది. అనుసంధానించబడిన USB, Wi-Fi అత్యత్తమ వెబ్ experienceని మీకు అందిస్తాయి. ‘S1 tablet’లో పొందుపరిచిన మరో ప్రత్యేకాంశం ఏమిటంటే... మీరు ఒకే సారి రెండు పేజీలను access చేసుకోవచ్చు. ఒక్కమాటలో చేప్పాలంటే ‘S1 tablet’ మీతో user friendlyలా సహకరిస్తుంది. అయితే ఇన్ని friendly applicationలు ‘డెల్ స్ట్రీక్ 10’లో కరువయ్యాయి.

వీటి ధరలను పరిశీలిస్తే ‘Dell Streak 10’ ధర మార్కెట్లో రూ.20,250 పలుకుతోంది. Sony S1 మాత్రం మార్కెట్లోకి విడుదల కాలేదు. అయితే దీని ధర రూ.27,000 ఉండోచ్చని అంచనా. ఈ రెండు బ్రాండ్ల మధ్య తారతమ్యాలను గమనించారుగా ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఏది బెస్టో..!!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X