‘ఆపిల్’కు చెక్ పెట్టే దమ్ము ‘డెల్’లో ఉందా..?

Posted By: Staff

‘ఆపిల్’కు చెక్ పెట్టే దమ్ము ‘డెల్’లో ఉందా..?


‘‘దిగ్గజ ‘ఆపిల్’ ల్యాపీలను అధిగమించే యోచనలో ‘డెల్’ ఓ అస్త్రాన్ని సంధించనుంది. అత్యాధునిక ఫీచర్లతో, అత్యంత పల్చనైన ల్యాపీ పరికరాన్ని డెల్ ప్రవేశపెట్టనుంది. ఒక పక్క బ్రాండ్ ఇమేజ్, మరో పక్క వినియోగదారుల్లో విశ్వసనీయత రెండు డెల్ కు కలిసొచ్చే అంశాలే.’’

సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ‘డెల్’ ప్రప్రధమంగా ల్యాప్ టాప్ ల రివల్యూషన్ కు పునాది వేసింది. సాంకేతికతకు కొత్తదనాన్ని జోడించి వినియోగదారుల విశ్వసనీయతను చొరగుంటున్న ‘డెల్’ సరికొత్త అల్ట్రాతిన్ (ultra thin) ల్యాపీ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

- డెల్ ‘XPS 14Z’ వర్షన్ లో విడుదలవుతున్న ఈ పల్చటి ల్యాపీపరికరం ఆల్యూమినియమ్ కోటెడ్ బాడీ ఫ్రేమ్ తో డిజైన్ కాబడింది. 14 అంగుళాల LED ఆధారిత డిస్ ప్లే, 1366 * 768 సామర్ధ్యం కలిగి ఉంటుంది.

- ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్ వ్యవస్థ వేగవంతమైన పనితీరును కలిగి ఉంటుంది.

- ల్యాపీలో పొందుపరిచిన విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ వ్యవస్థ వినియోగదారుడికి మరింత ఉపకరిస్తుంది.

- 8జీబీ ర్యామ్, 500 GB హార్డ్ డ్రైవ్ వ్యవస్థలు స్టోరేజి వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాయి. అత్యాధునిక ఆప్టికల్ డ్రైవ్, ట్రాక్ ప్యాడ్ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత మేలు చేకూరుస్తాయి.

- బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టువిటీ వంటి అత్యాధునిక అంశాలు సమచారా వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.

- అంతరాయం లేకుండా సినిమాలను వీక్షించేందుకు 1జీబీ వీడియో కార్డును ఈ ల్యాపీలో పొందుపరిచారు.

- పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 7 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- యూజర్ ఫ్రెండ్లీ ఫ్యూచర్లైన కార్డ్ రీడర్, మల్టీ టచ్ ప్యాడ్ వ్యవస్థలు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి.

- తొలత చైనాలో విడుదల కానున్న ఈ ‘డెల్ 14Z’ తరువాత అమెరికా, ఆపై ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని బ్రాండ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.38,000 నుంచి 41,000 మధ్య ఈ ల్యాపీ ధర ఉంటుందని తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting