‘డెల్ వాస్ట్రో’.. మొనగాళ్ల ఛాయిస్..!!

Posted By: Staff

‘డెల్ వాస్ట్రో’.. మొనగాళ్ల ఛాయిస్..!!

దిగ్గజ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ‘డెల్’ తాజా గ్యాడ్జెట్ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటనను వెలువరించింది. ‘డెల్’ వినియోగదారులు అత్యధిక శాతం ఉన్న భారతీయ ల్యాపీ పరికరాలు సెగ్మంట్‌లో, ‘డెల్ వాస్ట్రో 3450’ పేరుతో సరికొత్త ల్యాపీని విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుంది.

ఆధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘వాస్ట్రో 3450’ 14 అంగుళాల ధృడమైన వైడర్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ‘ఎల్‌ఈడీ’ టెక్నాలజీతో తిర్చిదిద్దబడిన బ్యాక్‌లిట్ డిస్‌ప్లే 1366 x 768 (WXGA) రిసల్యూషన్ కలిగి ఉంటుంది. ఇంటెల్ అత్యాధునిక ‘కోర్ i7-2620M 2.70-GHz’ ప్రొసెసర్ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది. పటిష్ట ‘4జీబీ DDR3 ర్యామ్ వ్యవస్థ’, ‘500జీబీ హార్డ్ డ్రైవ్’ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

మన్నికైన గ్రాఫిక్ వ్యవస్థను ఈ ల్యాపీలో ఏర్పాటు చేశారు. ‘హై డెఫినిషన్’ నాణ్యతతో గేమింగ్ అనుభూతిని కొనుగోలుదారుడు ఆస్వాదించవచ్చు. ‘1జీబీ ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్ కార్డ్’, ’ఏఎమ్‌డి రేడియన్ HD 6630M’ వ్యవస్థలు నాణ్యమైన స్క్రీన్ రిజల్యూషన్‌తో గ్రాఫిక్ విజువల్స్‌ను విడుదల చేస్తాయి. పొందుపరిచిన నోట్‌బుక్ కెమెరా వ్యవస్థ సౌలభ్యతతో వీడియో కాన్ఫిరెన్సింగ్ నిర్వహించుకోవచ్చు. 3.0 యూఎస్బీ పోర్టులతో పాటు, ఈ -సాటా కాంబో, హెచ్‌డి‌ఎమ్‌ఐ అవుట్ వంటి అంశాలు మన్నికైన కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంటాయి.

‘డేటా షేరింగ్’ నెట్ వర్కింగ్ అంశాలకు సంబంధించి ‘వైర్‌లెస్ ల్యాన్’, ‘వైర్‌లెస్ (NIC)’ వ్యవస్ధలు మరింత వేగవంతంగా స్పందిస్తాయి. పొందుపరిచిన బ్లూటూత్ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేస్తుంది. ల్యాపీలో ఏర్పాటు చేసిన ‘6-cell (48WHr)’ లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్ధ దీర్ఘకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 6 ఇన్ 1 కార్డ్ రీడర్’ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాణ్యమైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘డెల్ వాస్ట్రో 3450’ మార్కెట్లో రూ.65,990కు లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot