ఆగని ‘డెల్’ జోరు..!!

Posted By: Staff

ఆగని ‘డెల్’ జోరు..!!

అగ్రశ్రేణి ల్యాప్‌టాప్‌లను వినియోగదారులకు అందించటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ‘డెల్’ తన జోరును కొనసాగిస్తుంది. బ్రాండ్ తాజాగా విడుదల చేసిన ‘డెల్ వోస్ట్రో 3750’ మార్కెట్ వర్గాలు విశేషంగా ఆకట్టుకుంటోంది. i3/i5/i7 సామర్ధ్యం గల ప్రొసెసర్లలో లభ్యమవుతున్న ‘వోస్ట్రో’, న్విడియా జీ ఫోర్స్ జీటీ525ఎమ్ సామర్ధ్యం గల 3డీ యాక్సిలరోమీటర్ వీడియో కార్డ్ సౌలభ్యత కలిగి ఉంది. పొందుపరిచిన DDR3 ర్యామ్‌ను 6జీబీకి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజి సామర్ధ్యం విషయానికొస్తే 750 జీబీ సాటా హార్డ్ డిస్క్ డ్రైవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పటిష్టమైన లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ, హై డెఫినిషన్ కెమెరా, డిజిటల్ అరే మైక్రోఫోన్ వంటి అంశాలు
వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న ‘డెల్ వోస్ట్రో’ ల్యాపీ 17.3 అంగుళాల హై డెఫినిషన్ యాంటీ గ్లేర్ లెడ్ డిస్‌ప్లే సామర్ధ్యం కలిగి ఉంటుంది. పొందుపరిచిన 802.11 b/g/n వై - ఫై , బ్లూటూత్ వ్యవస్థలు కనెక్టువిటీ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. 2.25 కేజీల బరువుతో రూపొందించబడిన డెల్ ల్యాపీకి అనుసంధానించబడని స్పీకర్ మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ‘కామ్ఫీ’ బ్యాక్ లిట్ కీ బోర్డు, గెస్ట్యుర్ టచ్ ప్యాడ్ వంటి అంశాలు వినియోగదారుడికి మరింత దోహదపడతాయి.

పొందుపరిచిన సైబర్ లింక్ పవర్ డీవీడీ DX8.1 మీడీయ ప్లేయర్ వ్యవస్థ అత్యాధునిక గ్రాఫిక్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన v3.0 HS బ్లూటూత్ వ్యవస్థ సమాచార వ్యవస్థను మరింత చేరువుచేస్తుంది. ల్యాపీకి అనుసంధానించబడిన v2.0, v3.0 2x యూఎస్బీ పోర్టులు వీజీఏ, హెడ్డీఎమ్ఐ వ్యవస్థలకు సహకరిస్తాయి. చివరిగా ధర విషయానికి వస్తే ఈ ల్యాపీ రూ.40,000 ఉంటుంది. వినియోగదారునికి ఖచ్చితంగా ఈ పరికరం ఉపయుక్తంగా నిలుస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting