మార్కెట్లోకి డెల్ కొత్త ఉత్పత్తులు!

Posted By: Super

మార్కెట్లోకి డెల్ కొత్త ఉత్పత్తులు!

 

డెల్ కంప్యూటర్స్ మంగళవారం దేశీయ విపణిలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఎక్ప్‌పీఎస్ 12 కన్వర్టబుల్, లాటిట్యూడ్ 10 టాబ్లెట్, లాటిట్యూడ్ 6430యు అల్ట్రాబుక్, ఆప్టిలిక్స్ 9010 (ఆల్ ఇన్ వన్ టచ్), ఎస్2340టీ విన్8 మల్టీ-టచ్ మానిటర్ మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ సరికొత్త డివైజ్‌లు విండోస్8 ఆధారితంగా స్పందిస్తాయి. ఉద్యోగ కార్యకలాపాలకు ఈ పరికరాలు సమృద్ధిగా దోహదపడతాయి. ఈ ఆవిష్కరణ సందర్భంగా డెల్ ఇండియా మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పి.క్రిష్ణకుమార్ మాట్లూడుతూ డెల్ హార్డ్‌వేర్‌కు విండోస్ వోఎస్ తోడుకావటం వల్ల కంప్యూటింగ్ మరింత యూజర్ ఫ్రెండ్లీ అవుతుందని అన్నారు.

ఎక్ప్‌పీఎస్ 12 కన్వర్టిబుల్(xps 12 convertible)

ఈ డివైజ్‌ను టాబ్లెట్ అలాగే అల్ట్రాబుక్‌లా ఉపయోగించుకోవచ్చు. టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే మరో ప్రత్యేకత. అల్ట్రాబుక్‌లా ఉపయోగించుకుంటున్న సమయంలో స్ర్కీన్‌ను నచ్చిన యాంగిల్‌కు వొంపుకోవచ్చు.

ఫీచర్లు:

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

హింగ్ డిజైన్,

హైడెఫినిషన్ స్ర్కీన్,

కార్నింగ్ గొరిల్లా గ్లాస్,

12 కన్వర్టిబుల్ ఫీచర్స్,

ధర రూ.90,490.

మార్కెట్లో విక్రయాలు ప్రారంభమయ్యయి.

లాటిట్యూడ్ 10 టాబ్లెట్ (latitude 10 tablet)

ఆకర్షణీయమైన మల్లీ మీడియా ఫీచర్లు,

ఐటీ వాతావరణానికి సరియైన ఎంపిక,

ఆడ్వాన్స్ టచ్ వ్యవస్థ,

బిజినెస్ ఫ్రెండ్లీ ఆప్టికేషన్స్,

పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ (డెల్ డేటా ప్రొటక్షన్),

ధర రూ. 42,490.

నవంబర్ చివరి నుంచి ఈ డివైజ్ మార్కెట్లో లభ్యమవుతంది.

లాటిట్యూడ్ 6430యూ(latitude 6430u)

కార్పొరేట్ అవసరాలను తీర్చటంలో ఈ 14 అంగుళాల అల్ట్రాబుక్ క్రీయాశీలక పాత్రపోషిస్తుంది. డివైజ్ మన్నిక అలాగే సెక్యూరిటీ ఫీచర్లు మరింత సమర్థవంతంగా స్పందిస్తాయి. ప్రస్తుత 14 అంగుళాల లాటిట్యూడ్ నోట్‌బుక్‌తో పోలిస్తే ఈ సరికొత్త అల్ట్రాబుక్ 33శాతం స్లిమ్ ఇంకా 16శాతం తక్కువ బరువును కలిగి ఉంటుంది. అ డివైజ్‌లోని సింగిల్ బ్యాటరీతో ఒక రోజు కార్యకలాపాలను పూర్తిగా సాగించవచ్చు. డివైజ్ ప్రారంభ ధర రూ.69,990. నవంబర్ మధ్య నుంచి డివైజ్ దేశీయ మార్కెట్లో లభ్యమవుతుంది.

డెల్ ఆప్టిప్లెక్స్ 9010 ఆన్-ఇన్-వన్ పీసీ(Dell OptiPlex 9010 All-in-One PC):

ఈ స్లిమ్ డెస్క్‌టాప్ పీసీ తక్కువ ఖాళీని మాత్రమే ఆక్రమిస్తుంది. అత్యుత్తమ కంప్యూటింగ్ ను ఈ డివైజ్ నుంచి ఆశించవచ్చు. విండోస్8 ఆపరేటింగ్ సిస్టం, మల్టీ పాయింట్ టచ్‌స్ర్కీన్, రోటేటింగ్ కెమెరా తదితర ప్రత్యేకతలు. ధర రూ. 49,990. నవంబర్10 నుంచి ఈ డివైజ్ లభ్యమవుతుంది.

ఎస్2340టీ మల్టీ-టచ్ మానిటర్(S2340T Multi-touch Monitor):

ఈ మల్టీ టచ్ మానిటర్ మీడియా వినోదాలను అత్యుత్తమ శ్రేణిలో అందిస్తుంది. ఈ పీసీ ద్వారా యూజర్ అత్యుత్తమ టచ్ అనుభూతులను పొందవచ్చు. ధర వివరాలు తెలియాల్సి ఉంది. 2013 ఆరంభం నాటికి ఎస్2340టీ మల్టీ-టచ్ మానిటర్ దేశీయ మార్కెట్లో లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot