‘డెల్’ ల్యాపీ మీ సొంతమైతే..!!

‘‘నాణ్యమైన కంప్యూటింగ్ పరికరాలను వినియోగదారులకు అందించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ‘డెల్’ మరో విశిష్ట ల్యాప్‌టాప్ పరికరాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘డెల్ XPS 15z’ మోడల్‌లో ఆధునిక కాన్ఫిగరేషన్లతో రూపుదిద్దుకున్న ధృడమైన ఈ ల్యాపీ పరికరం మార్కెట్ వర్గాల్లో అంచనాలను మరింత రెట్టింపు చేస్తుంది.’’
క్లుప్తంగా ‘డెల్ XPS 15z’ ఫీచర్లు :
- విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ ల్యాపీ పరికరం పనిచేస్తుంది.
- 15.6 అంగుళాల హై డెఫినిషన్ బ్యాక్‌లిట్ డిస్‌ప్లే నాణ్యమైన విజువల్స్‌ను విడుదల చేస్తుంది.
- శక్తివంతమైన ఇంటెల్ కోర్ i5/i7 ప్రొసెసింగ్ వ్యవస్థలను ల్యాపీలో పొందుపరిచారు.
- పొందుపరిచిన ‘న్విడియా ఏటీఐ’ గ్రాఫిక్ వ్యవస్థ క్రిస్టల్ క్లియర్ ఆప్పీరియన్స్‌తో పాటు నాణ్యమైన గ్రాఫిక్ విజువల్ అనుభూతికి లోనుచేస్తుంది.
- 8 GB DDR3 – 1333 MHz ర్యామ్, పటిష్టమైన 750 జీబి హార్ఢ్ డిస్క్, డీవీడీ రైటర్, హెచ్డీఎమ్ఐ పోర్టు తదితర అంశాలు వినియోగదారునకి మరింత లబ్ధి చేకూరుస్తాయి.
- అత్యాధునిక వై-ఫై, సమర్ధవంతమైన బ్లూటూత్ వంటి ఆప్లికేషన్లు కనెక్టువిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి.
- 9 ఇన్ 1 కార్డ్ రీడర్, వెబ్ క్యామ్, ఇంటిగ్రేటడ్ మైక్రో ఫోన్ వంటి అంశాలు ల్యాపీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
- పొందుపరిచిన 6/9 సెల్ లిథియాన్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
- ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ ల్యాపీ ధర రూ. 78,000 ఉంటుందని కంపెని వర్గాలు స్పష్టం చేశాయి.


Click it and Unblock the Notifications