డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

Posted By:

ఇది కంప్యూటర్‌ యుగం. ప్రతి ఒక్కరికి కంప్యూటర్‌‌తో అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నేటితరం విద్యార్థులకు కంప్యూటర్‌  పరిజ్ఞానం తప్పనసరి!. ప్రస్తుత పోటీ ప్రంపంచంలో ఏ రంగంలో వారికి అయినా కంప్యూటర్‌తో చాలా అవసరం ఏర్పడుతోంది. ఇటీవల కంప్యూటర్‌ కొనాలి అనుకునే వారికి ముఖ్యంగా 3 ప్రధానమైన ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మొదటిది డెస్క్‌టాప్‌.

అంటే మానిటర్‌, సిపియు, కీబోర్డ్‌, మౌస్‌ ఇలా విడివిడిగా ఉంటాయి. రెండవది లాప్‌టాప్‌ అన్నీ కలిసి ఒకటే చిన్న టేబుల్‌ లాగా ఉంటుంది. మూడవది టాబ్లెట్ 7 నుంచి 10 అంగుళాల తాకేతెరతో పలక మాదిరి చేతిలో ఇమిడిపోయే విధంగా ఉంటంది. ఈ మూడింటిలో డెస్క్‌టాప్‌ కన్నా లాప్‌టాప్‌ చాలా చిన్నదిగా సింపుల్‌గా ఉంటుంది. టాబ్లెట్‌ ఈ రెండింటికన్నా చిన్నదిగా ఇంకా పోర్టబుల్‌గా ఉంటుంది. లాప్‌టాప్‌ను, టాబ్లెట్‌ను మామూలుగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు. కానీ డెస్క్‌టాప్‌కి ఆ సౌకర్యం లేదు.

మరిన్ని వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

ధర విషయానికి వస్తే ఈ ఈ మూడింటిలో టాబ్లెట్ తక్కువ ధరను కలిగి ఉంటుంది. లాప్‌టాప్‌‌తో పోలిస్తే కన్నా డెస్క్‌టాప్‌‌లు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. ఒక మామూలు కాన్ఫిగరేషన్‌ గల డెస్క్‌టాప్‌ వెల కన్నా అదే కాన్ఫిగరేషన్‌ ఉన్న లాప్‌టాప్‌ 1 1/2 రెట్లు ఎక్కువ ధర ఉంటుంది.

 

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

పనితీరు విషయానికొస్తే టాబ్లెట్, కంప్యూటింగ్ అవసరాలను సమృద్థిగా తీర్చలేదు. పనితీరు విషయంలో డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌లు నవ్వా నేనా అన్నట్లుగా పోటిపడతాయి.

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

డెస్క్‌టాప్‌లో వివిధ భాగాలు విడివిడిగా ఉంటాయి. కాబట్టి ఒక భాగం రిపేరు చేయాల్సిన అవసరం వచ్చినా ఆ భాగం వరకు చేస్తే సరిపోతుంది. కానీ లాప్‌టాప్‌ అన్నీ కలిపి ఒక చిన్న ప్రదేశంలో నిక్షిప్తం చేసి ఉంచడం వల్ల వాటిని రిపేరు చేయడం

కష్టతరమవుతుంది.

 

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

రిపేరు చేసే సమయంలో లాప్‌టాప్‌ కన్నా డెస్క్‌టాప్‌ యొక్క రిపేరు ధర తక్కువగా ఉంటుంది. కొత్త భాగం కొనే ధర కూడా నిర్ణీతమైన ధరలోనే ఉంటాయి. కానీ లాప్‌టాప్‌ను రిపేరు చేయడం కష్టం. దానిని ఒక ఇంజనీరు స్థాయి వారికి మాత్రమే రిపేరుకి ఇవ్వగలం. దాని ధర కూడా ఎక్కువ ఉంటుంది. డెస్క్‌టాప్‌కు రకరకాల భాగాలను అమర్చవచ్చు. కానీ లాప్‌టాప్‌కు అన్ని రకాల ఛాయిస్‌లు ఉండవు. కొన్ని మాత్రమే సరిపోతాయి.

 

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

డెస్క్‌టాప్‌లో అవసరమైన సమయంలో కొత్త డివైస్‌లను అమర్చవచ్చు. దానికి సరిపోయేంత సైజు ఉంటుంది కానీ లాప్‌టాప్‌కు ఆ సౌకర్యం ఉండదు. దానిలో ఉన్న అప్లికేషన్లు మరియు డివైస్‌ల వరకు మాత్రమే వాడుకునే వీలు ఉంటుంది. డెస్క్‌టాప్‌లో ఏదైనా భాగం రిప్లేస్‌ చేయడం సులభతరం. కానీ లాప్‌టాప్‌లో రిప్లేస్‌ చేసే అవకాశం చాలా తక్కువ.

 

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

డెస్క్‌టాప్‌ను ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళే అవకాశం ఉండదు. కానీ లాప్‌టాప్‌ మనం ఎక్కడికి అయినా తీసుకెళ్ళవచ్చు. దీని వల్ల ప్రమాదాలు జరిగి కిందపడడం, ఏదైనా లాప్‌టాప్‌ మీద పడడం వంటి అవకాశాలు ఉన్నాయి.

 

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

ప్రాథమిక వినియోగదారులు లాప్‌టాప్‌ యొక్క వినియోగాన్ని సులువుగా అర్థం చేసుకోలేరు. ఒక్కొక్క లాప్‌టాప్‌కు ఒక్కోరకమైన ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది. బోర్డ్‌ ఇలాగే లాప్‌టాప్‌ యొక్క స్క్రీన్‌ సైజ్‌ నిర్ణీతంగా ఉంటుంది. కానీ డెస్క్‌టాప్‌లో కావాలంటే చిన్నది

లేదా పెద్దది తీసుకోవచ్చు. కానీ డెస్క్‌టాప్‌ అమర్చడానికి ఎక్కువ ప్రదేశం కావాలి. లాప్‌టాప్‌కు చిన్న టేబుల్‌ అయినా

సరిపోతుంది.

 

డెస్క్‌టాప్‌.. లాప్‌టాప్‌..ఏది బెస్ట్?

ఈ విధంగా రకరకాల కారణాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ కారణాలన్నింటికన్నా యూజర్‌ యొక్క పని అనేది ప్రధాన కారణంగా తీసుకోవాలి. యూజర్‌ యొక్క అవసరంకు తగ్గట్టుగా కంప్యూటర్‌ తీసుకోవడం శ్రేయస్కరం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Desktop.. Laptop.. which is the best..?. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot