హైడెఫినిషన్ టెలివిజన్ - ఎల్‌సీడీ టెలివిజన్ (ఏది బెస్ట్..?)

Posted By:

శక్తివంతమైన వినోద సాధానల్లో ఒకటైన టెలివిజన్ ఇప్పుడు ప్రతి ఇంటికి తప్పనిసరైంది. కాలానుగుణంగా టెలివిజన్ వ్యవస్థలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు అనేక టీవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సీఆర్‌టీ (కాథోడ్ రే ట్యూబ్)లకు భిన్నంగా ఎల్‌సీడీ ఇంకా హైడెఫినిషన్ టీవీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇవి డైరెక్ట్ వ్యూ టీవీలతో పోలిస్తే నాజూకు తత్వాన్ని కలిగి తక్కువ స్థలాన్ని ఆక్రమించటమే కాకుండా మెరుగైన దృశ్య నాణ్యతను అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎల్‌సీడీ ఇంకా హైడెఫినిషన్ టెలివిజన్ మధ్య వ్యత్యాసాన్ని మీకు వివరిస్తున్నాం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైడెఫినిషన్ టెలివిజన్ - ఎల్‌సీడీ టెలివిజన్ (ఏది బెస్ట్..?)

హైడెఫినిషన్ టెలివిజన్ (HIGH DEFINITON TELEVISON): వినోద విభాగంలో కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న మార్పులు హైడెఫినిషన్ (హెచ్‌డి) టీవీల పట్ల మోజును పెంచుతున్నాయి. కారణం.. స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డి) టీవీ సెట్‌లతో పోలిస్తే హైడెఫినిషన్ (టీవీలు) మెరుగైన దృశ్య నాణ్యతను అందిస్తున్నాయి. స్టాండర్డ్ డెఫినిషన్ టీవీలు కేవలం 480 పిక్సల్ రిసలక్యూషన్‌ను కలిగి ఉంటాయి. అదే హైడెఫినిషన్ టీవీలు 720 పిక్సల్ సామర్ధ్యం నుంచి 1080 పిక్సల్ సామర్ధ్యం వరకు అనేక వేరియంట్‌లలో లభ్యమవుతాయి. చిన్నతెర టీవీల విషయంలో ఎస్‌డి, హెచ్‌డి టీవీల మధ్య పెద్దగా తేడా కనిపించదు. స్ర్కీన్ సైజు పెరిగేకొద్ది ఆ తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లోపలికి స్వాగతం..సమ్‌థింగ్ స్పెషల్ ఇండియన్ మార్కెట్ విషయానికొస్తే రాబోయే 5-6ఏళ్ల కాలంలో హైడెఫినిషన్ టీవీలకు ఆదరణ మరింత పెరిగే అవకాశముందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల ఓ నివేదకలో పేర్కొంది. దేశంలో హెచ్‌డి బ్రాడ్ కాస్టర్ల సంఖ్య తక్కువుగా ఉండటంతో హెచ్‌డి టీవీలను ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేసినప్పటికి దృశ్య నాణ్యత అంతగా మెరుగుపడదు. భవిష్యత్‌లో మాత్రం పూర్తిస్థాయి హైడెఫినిషన్ వినోదాన్ని పొందగలుగుతారు.

 

ఎల్‌సీడీ టెలివిజన్ (LCD TELEVISON):

ఎల్‌సీడీ టెలివిజన్ (LCD TELEVISON): ఎల్‌సీడీ (లిక్విడ్ క్రిస్టల్ డిస్ ప్లే), ఈ టెక్నాలజీకి ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్. ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిన టెలివిజన్ సెట్‌లు దేశీయ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఎల్‌సీడీ టెలివిజన్‌లు తక్కువ బరువును కలిగి ఫ్లాట్ ప్యానెల్‌తో ఉంటాయి. చాలా మంది ఇళ్లలోని సీఆర్‌టీ టీవీల స్థానాన్ని ఎల్‌సీడీ టీవీలు భర్తీ చేసేసాయి. ఎల్‌సీడీ టెలివిజన్‌లను కేవలం టీవీలుగానే కాకుండా కంప్యూటర్ మానీటర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో 2009 నుంచి వీటికి పెరుగుతూ వస్తోంది. 15 అంగుళాల నుంచి 55 అంగుళాల వరకు వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో ఎల్‌సీడీ టీవీలు లభ్యమవుతున్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot