పుకార్లు బాబోయ్ పుకార్లు.. ఏది నమ్మాలి?

Posted By: Prashanth

పుకార్లు బాబోయ్ పుకార్లు.. ఏది నమ్మాలి?

 

రెండు రోజుల క్రితం ప్రపంచానికి పరిచయమైన మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్లు గ్యాడ్జెట్ ప్రియులను కనవిందు చేస్తుంటే... గుగూల్ నెక్సస్‌కు సంబంధించిన ఆసక్తికర పుకార్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో దేనిని నమ్మాలో అర్ధంకాని పరిస్ధితి గుగూల్ అభిమానుల్లో నెలకుంది. గుగూల్, అసస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో డిజైన్ కాబడిన గుగూల్ నెక్సస్ టాబ్లెట్ గత కొంత కాలంగా ఊరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ కంప్యూటింగ్ డివైజ్‌కు సంబంధించి ఆది నుంచి అనేక పుకార్లు వ్యక్తమవుతున్నాయి. సేకరించిన సమాచారం మేరకు గుగూల్ నెక్సస్ టాబ్లెట్ పీసీని ఈ నెలలో లాంచ్ చేసే అవకాశముంది. వై-ఫై వర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. 3జీ వర్షన్‌కు సంబంధించి సమాచారం లేదు. ఈ టాబ్లెట్‌లలో స్మార్ట్‌ఫోన్ తరహా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గుగూల్ క్రోమ్‌ బ్రౌజర్‌ను పీసీలో ముందుగానే సంస్థాపితం చేసినట్లు వినికిడి.

ఈ డివైజ్‌ల తొలి బ్యాచ్‌కు సంబంధించి రవాణా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు ప్రచారం సాగుతోంది. వచ్చే నెలనుంచి వీటి అమ్మకాలను ప్రారంభంకానున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. కాగా, గుగూల్ నెక్సస్ టాబ్లెట్ ఇండియన్ మార్కెట్ ధరను రూ.12,000గా అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, గుగూల్ నెక్సస్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 4.1 జెల్లీబీన్‌ పై రన్ అవుతుందన్న ప్రచారం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటిలో ఏ ఒక్క విషయాన్ని గుగూల్ వర్గాలు నిర్థారించలేదు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆవిష్కరణ సమయం వరకు ఎదురుచూపులు తప్పవు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot