టాప్ హిరోల మధ్య ‘బిగ్ ఫైట్’!

Posted By: Staff

టాప్ హిరోల మధ్య ‘బిగ్ ఫైట్’!

డ్రాప్ ఇంకా టార్చర్ పరీక్షలు సాధారణంగా గ్యాడ్జెట్‌లోని సామర్ధ్యాన్ని వెలికితీస్తాయి. ఇటీవల కాలంలో ‘ఆపిల్ ఐఫోన్ 4ఎస్ vs సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3’, ఆపిల్ ఐఫోన్ 4ఎస్ vs సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 vs హెచ్‌టీసీ వన్ ఎక్స్ టాబ్లెట్ పీసీల మధ్య నిర్వహించిన డ్రాప్‌టెస్ట్‌లను వీడియోల రూపంలో తిలకించాం. తాజాగా నిర్వహించిన మరో డ్రాప్‌టెస్ల్ విశ్లేషకులను సైతం ఉత్కంఠకు లోను చేసింది. గుగూల్ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన నెక్సస్ 7, ఆపిల్ రూపొందించిన కొత్త వర్షన్ ఐప్యాడ్‌ల మధ్య

డ్రాప్ టెస్ట్‌ను నిర్వహించారు. టెస్ట్‌లో భాగంగా రెండు పీసీలను ఛాతి స్థాయి నుంచి జార విడిచారు. ఈ క్రమంలో గుగూల్ నెక్సస్ తక్కువ నష్టాన్ని నమోదు చేయగా ఆపిల్ కొత్త ఐప్యాడ్ స్వల్ప గాయాలతో బయపడింది. రెండవ పోటీలో భాగంగా రెండు గ్యాడ్జెట్‌లను నీటితో నిండి ఉన్న బాత్‌టబ్‌లో జారవిడిచారు. గ్యాడ్జెట్‌లు నీటిలో మునిగినప్పటికి సమర్ధవతంగా పని చేయటం ప్రారంభించాయి. విశ్లేషకుల సమక్షంలో నిర్వహించిన ఈ డ్రాప్ పరీక్ష గుగూల్ జెల్లీబీన్ టాబ్లెట్ పటిష్టతను రుజువుచేసింది.

vedio url:


src="http://www.youtube.com/watch?feature=player_embedded

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot