రియల్ ఫైట్ (వీడియో)

By Prashanth
|
iPad Mini vs Nexus 7


టెక్ టైటాన్ ఆపిల్ తాజాగా 8 అంగుళాల టాబ్లెట్, ఐప్యాడ్ మినీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అనేక రూమర్ల అనంతరం గూగుల్ సైతం ఆండ్రాయిడ్ 4.1 జెల్లబీన్ ఆధారితంగా స్పందించే 16జీబి ఇంకా 32జీబి వర్షన్ నెక్సస్ టాబ్లెట్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు గ్యాడ్జెట్ల మన్నికలను అంచనా వేసే క్రమంలో ఆండ్రాయిడ్ ఆథారిటీ డ్రాప్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్‌లో భాగంగా నాలుగు అడుగుల ఎత్తునుంచి ఈ రెండు డివైజ్‌లను వేరు వేరు కోణాల్లో నెలపైకి జారవిడిచారు. ఉత్కంఠతతో సాగిన ఈ డ్రాప్ టెస్ట్‌లో ఐప్యాడ్ మినీ తన సామర్ధ్యాన్ని మరోసారి చాటుకుంది. ఆ వీడియో మీకోసం......

వీడియో యూఆర్ఎల్:

ఐప్యాడ్ మినీ ఫీచర్లు:

7.9 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ ర్వహించుకునేందుకు), ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై,బ్లూటూత్, 16.3 లిపో బ్యాటరీ (10 గంటల బ్యాకప్).

గూగుల్ నెక్సస్ 7:

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ బ్యాక్లిట్ ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

కార్నింగ్ గొరిల్లా గ్లాస్,

క్వాడ్-కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వై-ఫై 802.11 బి/జి/ఎన్,

బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,

4325ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ,

మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X