బాగుంటే చాలు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారు!

Posted By: Prashanth

బాగుంటే చాలు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారు!

 

ఉన్నతమైన కంప్యూటింగ్ విలువలతో మన్నికైన పనితీరును కనబరిచే టెక్ గ్యాడ్జెట్‌లను ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఈ కోవకే చెందిన ప్రముఖ బ్రాండ్ డీఆర్ఎస్(DRS) సరికొత్త ప్రణాళికతో టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. జనాధరణను అధికంగా కలిగి ఉన్న ఈ బ్రాండ్ శక్తివంతమైన టాబ్లెట్ పీసీలను రూపొందించటంలో దిట్ట. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు నీరు, దుమ్ము, షాక్ వంటి ప్రతికూల వాతావరణాలను సమర్థవంతంగా ఎదుర్కొగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

తాజాగా డీఆర్ఎస్, మూడు కొత్త వేరియంట్‌లలో టాబ్లెట్ పీసీలను లాంచ్ చేసేందుకు సన్నద్ధమువుతోంది. వీటీ పేర్లు డీఆర్ఎస్ X7ad, డీఆర్ఎస్ X7et,డీఆర్ఎస్ X12kb. ‘MIL-STD 810G’ సర్టిఫికేషన్ పొందిన ఈ మూడు డివైజ్‌లు క్వాలిటీ కంప్యూటింగ్‌ను యూజర్‌కు అందిస్తాయి.

డీఆర్ఎస్ X7ad:

7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు,

బరువు 1.3 పౌండ్లు.

వై-ఫై,

బ్లూటూత్.

డీఆర్ఎస్ X7et:

7 అంగుళాల టచ్ స్ర్కీన్,

విండోస్ ఆపరేటింగ్ సిస్టం,

ఆటమ్ Z670 ప్రాసెసర్,

బరువు 1.5పౌండ్లు,

వై-ఫై,

బ్లూటూత్.

డీఆర్ఎస్ X12kb:

అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమవుతున్న ఈ టాబ్లెట్ బరువు 5.5 పౌండ్లు, స్ర్కీన్ పరిమాణం 12.1 అంగుళాలు, టచ్ స్ర్కీన్, కోర్ ఐ5 560 UMCPU ప్రాసెసర్, స్పిల్ ప్రూఫ్ కీబోర్డ్, టచ్ ప్యాడ్, వై-ఫై, బ్లూటూత్. ఈ మూడు టాబ్లెట్లకు సంబంధించి ధరల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting