కొత్తగా మరొకటి.. జనం విశ్వసించేనా?

Posted By: Prashanth

కొత్తగా మరొకటి.. జనం విశ్వసించేనా?

 

బడ్జెట్ టాబ్లెట్ కంప్యూటర్ల విభాగంలోకి మరో బ్రాండ్ ఆరంగ్రేటం చేసింది. ప్రముఖ సంస్థ ఇమాటిక్ ‘ఈగ్లైడ్ ఎక్స్‌ఎల్ ప్రో2’పేరుతో టాబ్లెట్ పీసీని రూపొందించింది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుంది. బ్లాక్ కలర్ వేరియంట్‌లో స్టైలిష్‌గా డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్ అనేకమైన అప్లికేషన్‌లను ఒదిగి ఉంది. టాబ్లెట్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

10 అంగుళాల మల్టీ‌టచ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

400మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

మల్టీకోర్ చిప్‌సెట్,

ఫ్రంట్ కెమెరా (లైవ్ వీడియో చాటింగ్ కోసం),

1080 పిక్సల్ హై‌డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబి,

1జీబి ర్యామ్,

32జీబి ఎక్సటర్నల్ మెమరీ,

వై-పై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్రౌజర్ (హెచ్ టిఎమ్ఎల్),

హై క్వాలిటీ ఆడియో ప్లేయర్,

హై క్వాలిటీ వీడియో ప్లేయర్,

గేమ్స్,

ఎఫ్ఎమ్ రేడియో,

లౌడ్ స్పీకర్,

ధర అంచనా రూ.11,000.

టాబ్లెట్‌లో ఈ-పుస్తకాలతో పాటు ఈ పేపర్లను చదువుకునేందుకు కోబో ఈ-రీడింగ్ అప్లికేషన్‌ను నిక్షిప్తం చేశారు. లోడ్ చేసిన ఆడ్వాన్సుడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వేగవంతమైన వెబ్‌బ్రౌజింగ్‌తో పాటు అంతరాయంలేని యూజర్ ఫ్రెండ్లీ మల్టీ టాస్కింగ్‌కు తోడ్పడుతుంది. పీసీలో లోడ్ చేసిన మరో అప్లికేషన్ ‘ఇమాటిక్ అప్లికేషన్ షాప్’ద్వారా టెక్నాలజీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పొందుపరిచిన ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ వ్యవస్థలు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి. టాబ్లెట్ విడుదల తేదీ ఖరారుకావల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot