ఆగష్ట్ 23న ‘ఐ’

By Prashanth
|
Energy Sistem


ప్రముఖ సంస్థ ఎనర్జీ సిస్టమ్ (Energy Sistem) 8 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌‌లో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లట్ పీసీని ప్రకటించింది. ధర అంచనా రూ.19,000. స్లేట్ లైనప్ నుంచి విడుదల కాబోతున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ పేరు ‘ఐ8 స్లేట్’. కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఫీచర్లు:

 

8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

 

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.0గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

1జీబి,

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

2మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

హెచ్‌డిఎమ్ఐ అవుట్,

వై-ఫై కనెక్టువిటీ,

శక్తివంతమైన 3800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో అగష్టు23 నుంచి ఐ8 స్లేట్ లభ్యంకానుంది. ఈ డివైజ్‌ను కొనదలిచిన వారు ఎనర్జీ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగినై డివైజ్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

ఈ టాబ్లెట్ ధర రూ.3,699!

ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ జింక్ (Zync) జడ్-909 పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని ప్రకటించింది. దీని ధర రూ.3,699. 7 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్, 1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. టాబ్లెట్ ముందు భాగంలో నిక్షిప్తం చేసిన 0.3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాణ్యమైన వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది. పీసీలో అమర్చిన 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. యూఎస్బీ పోర్ట్ సపోర్ట్‌తో పీసీని ఇతర డాంగిల్స్‌తో పాటు కీబోర్డ్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. వై-పై కనెక్టువిటీ సౌలభ్యత, బిగ్‌ఫ్లిక్స్, ఐబీబో, యాంగ్రీ బర్డ్స్ వంటి అప్లికేషన్‌లను పీసీలో ముందుగానే లోడ్ చేశారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X