ఫొటో సరదా ప్రాణాలు తీసింది!

Posted By:

అప్పటి వరకు ఆహ్లాదంగా సాగుతున్న విహారయాత్ర కొద్ది క్షణాల వ్యవధిలోనే విషాధగాదలో మిగిలిపోయింది. నదిలో దిగి సరదాగా ఫోటోలు దిగుతున్న ఆ విద్యార్థలను అకస్మాత్తుగా చొచ్చుకు వచ్చిన నీటి ప్రవాహం తన్నుకు పోయింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాదు శివారు బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐఈఈ రెండో సంవత్సరం చదువును పూర్తి చేసుకున్న 49 విద్యార్థుల బృందం ముగ్గురు అధ్యాపకులతో కలిసి ఈ నెల 3వ తేదీన ఢిల్లీ, హిమాచల్, ఉత్తర ప్రదేశ్ వెళ్లాలని నిర్ణయించుకుంది.

 ఫొటో సరదా ప్రాణాలు తీసింది!

ముందుగా ఢిల్లీకి చేరుకున్న ఈ బృందం అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించింది. ఆదివారం ఉదయం కులుమనాలి చేరకుని అక్కడి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బియాస్ సది పై ఉన్న లార్జీ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించడానికి బృంద సభ్యులు వెళ్లారు. తమ విహార అనుభూతులను మధుర స్మృతల రూపంలో బంధించేందుకు ఆ విద్యార్థులు బియాస్ నది ఒడ్డును సరదాగా ఫోటోలు దిగటం ప్రారంభించారు.

అదే సమయంలో నదికి పైన ఉన్న126 మెగావాట్ల లార్జీ జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించిన జలాశయం నుంచి నీటిని అధికారులు విడుదల చేయటంతో నదిలో అకస్మాత్తుగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం సహాయక చర్యలు చేపట్టారు మూడు మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు. ఐశ్వర్య అనే విద్యార్థిని మృతదేహాన్ని రక్షణ సిబ్బంది వెలికి తీశారు. గాలింపు ముమ్మరం చేశారు. ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు మండి ఎస్పీ చెప్పారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపుచర్యలు నిలిపేసినట్లు ఆయన తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting