అక్టోబర్ ఫీవర్... ఓపిక పట్టలేని ఫ్యాన్స్ కోసం ఆ కీలక వివరాలు!

Posted By: Super

అక్టోబర్ ఫీవర్... ఓపిక పట్టలేని ఫ్యాన్స్ కోసం ఆ కీలక వివరాలు!

దేశవ్యాప్త బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల అమ్మకాల్లో భాగంగా రెండో స్థానం పై కన్నేసిన మైక్రోమ్యాక్స్ మరో కొత్త ఆవిష్కరణకు ముస్తాబవుతోంది. ఈ బ్రాండ్ నుంచి వారం క్రిందటే 'ఫన్‌బుక్ ఇన్ఫినిటీ" పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని విడుదల చేసారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మైక్రోమ్యాక్స్ 'ఫన్‌బుక్ టాక్ పీ350" పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని వచ్చే వారం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లైన సాహోలిక్ డాట్ కామ్, ఈబే డాట్ ఇన్‌లు డివైజ్‌కు సంబంధించి ఈ రోజు నుంచే ప్రీఆర్డర్‌లను ఆహ్వానిస్తున్నాయి.

ఇదే సమయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి 'గిజిబాట్"కు ఈ-మెయిల్ ఆహ్వానం అందింది. ఈ ఆహ్వాన ప్రకటనలో పొందుపరిచిన సమాచారం మేరకు ఢిల్లీ వేదికగా అక్టోబర్ 9 ఉదయం 11.30 నిమిషాలకు ఈ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతోంది. అక్టోబర్ 9వరకు ఓపిక పట్టలేని మైక్రోమ్యాక్స్ అభిమానుల కోసం 'ఫన్‌‍బుక్ టాక్ పీ350" అధికారిక స్పెసిఫికేషన్‌లు.....


డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్‌ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది,

మెమరీ: 4జీబి ఇంటర్నల్ ఫ్లాష్ స్టోరేజ్ , 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై 802.11 b/g/n, జీపీఆర్ఎస్, మైక్రోయూఎస్బీ 2.0 పోర్ట్,

బ్యాటరీ: 2800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5 గంటలు ఖచ్చితంగా),

ఇతర ఫీచర్లు:

గూగుల్ ప్లే, మ్యూజిక్, పికాసా, యూట్యూబ్, డాక్యుమెంట్ వ్యూవర్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot