నేడే విడుదల..ఆ ఇద్దరికి సవాల్!

Posted By: Staff

నేడే విడుదల..ఆ ఇద్దరికి సవాల్!

 

 

కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వైప్ టెలికామ్, ఇండియన్ టాబ్లెట్ పీసీల మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారితంగా స్పందించే సరికొత్త టాబ్లెట్‌ను సోమవారం మార్కెట్లో ఆవిష్కరించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. టాబ్లెట్ పేరు అదేవిధంగా మోడల్ నెంబర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించేందకు సంబంధిత వర్గాలు నిరాకరించాయి. సేకరించిన వివరాల మేరకు డివైజ్ స్పెసిఫికేషన్‌లు......

సిమ్ కార్డ్ సపోర్ట్,

3జీ కాలింగ్,

ఆండ్రాయిడ్ 4.1 అకా జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగిగాహెడ్స్ ప్రాసెసర్,

బ్లూటూత్ కనెక్టువిటీ,

ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా ఆప్షన్స్,

ధర అంచనా రూ.10,000.

ఆధునిక జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్, వికెడ్‌లీక్ వామ్మి డిజైర్ ఇంకా కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 2లకు గట్టిపోటీనివ్వగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Read in Hindi

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot