వచ్చే వారం మార్కెట్లోకి ‘వైకిడ్‌లీక్ జెల్లీబీన్’ టాబ్లెట్!

Posted By: Prashanth

వచ్చే వారం మార్కెట్లోకి ‘వైకిడ్‌లీక్ జెల్లీబీన్’ టాబ్లెట్!

 

సరికొత్త ఆవిష్కరణలతో టెక్ ప్రపంచం బిజీ వాతావరణాన్ని తలపిస్తున్న నేపధ్యంలో దేశీయ బ్రాండ్ వైకిడ్‌లీక్ సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్‌ను వచ్చే వారం ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. 9.7 అంగుళాల డిస్‌ప్లే పరిమాణాన్ని కలిగి ఉండే ఈ డివైజ్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ పై రన్ అవుతుంది. 5 పాయింట్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే. ధర ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆధునిక ఫీచర్లను ఈ గ్యాడ్జెట్ ఒదిగి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా ‘వామ్మీసిరీస్’ నుంచి సంస్థ విడుదల చేసిన 10 అంగుళాల టాబ్లెట్‌లు వామ్మీ 7, వామ్మీ ఇతోస్, వామ్మీ ప్లస్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లభ్యమవుతున్నాయి. ప్రారంభ ధర రూ.5,249.

వామ్మీ 7 కీలక ఫీచర్లు:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ10 ఆల్ విన్నర్ ప్రాసెసర్, 400మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబీ ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ 4జీబి, మైక్రోఎస్డీ స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 32జీబికి పెంచుకోవచ్చు, డాంగిల్ సహాయంతో 3జీ ఫీచర్లను ఆస్వాదించవచ్చు, వీజీఏ ఫ్రంట్ కెమెరా, గుగూల్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశించే సౌలభ్యత, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ సౌలభ్యతతో టాబ్లెట్‌ను హై డెఫినిషన్ టీవీలకు అనుసంధానించుకోవచ్చు, 5 గంటల బ్యాకప్ నిచ్చే 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర రూ.5,249.

వామ్మీ ఇతోస్ కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల టచ్ స్ర్కీన్, మినీ యూఎస్బీ పోర్ట్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, మినీ హెచ్ డిఎమ్ఐ, ధర రూ.8,999.

వామ్మీ ప్లస్ కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల 5 పాయింట్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 3జీ సిమ్ స్లాట్, వై-ఫై, జీపీఎస్, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మీనీ హెచ్ డిఎమ్ఐ పోర్ట్, 512 ఎంబీ ర్యామ్, ధర రూ.11,499.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot