ఫేస్‌‌బుక్ చేతికి ఒకులస్ గేమింగ్ కంపెనీ

Posted By:

సామాజిక సంబంధాల దిగ్గజం ఫేస్‌బుక్ నెల రోజుల వ్యవధిలో రెండవ అతిపెద్ద కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రిందటే 19 బిలియన్ డాలర్ల మొత్తానికి (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ సుమారు రూ.1,17,800 కోట్లు) వాట్స్‌యాప్‌ను సొంతం చేసుకున్న ఫేస్‌బుక్ తాజాగా వర్చువల్ రియాలిటీ హెడ్ మౌంటెడ్ గేమింగ్ డిస్‌ప్లేలను సమకూర్చే ఒకులస్ కంపెనీని  కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

ఫేస్‌‌బుక్ చేతికి ఒకులస్ గేమింగ్ కంపెనీ

డీల్ విలువ 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.12,000 కోట్లు). ఏప్రిల్-జూన్ నాటికి ఈ ఒప్పందం పూర్తయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా, కొనుగోలుతో ఫేస్‌బుక్ గేమింగ్, మీడియా, వినోదం ఇంకా కమ్యూనికేషన్స్ విభాగాల్లో మరింత బలోపేతం కానుంది. ఈ డీల్‌లో భాగంగా 400 మిలియన్ డాలర్లను నగదు రూపంలో మిగిలిన్ మొత్తాన్ని షేర్ల రూపంలో ఇవ్వున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed /n6X2yzwF9Zo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot