10 కోట్లు దాటిన ఫేస్‌బక్ యూజర్ల సంఖ్య!

Posted By:

సామాజిక సంబంధాల దిగ్గజం ఫేస్‌బుక్ దేశీయంగా 10 కోట్ల పై చిలుకు వినియోగాదారులను సొంతం చేసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పింది. దింతో అత్యధిక ఫేస్‌బుక్ వినియోగదారులను కలిగి ఉన్న రెండవ అతిపెద్ద దేశంగా భారత్ చరిత్ర నెలకొల్పింది. 183 మిలయన్ యూజర్లతో అమెరికా ముందంజలో కొనసాగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 30 నాటికి భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 94 మిలియన్లు.

 10 కోట్లు దాటిన ఫేస్‌బక్ యూజర్ల సంఖ్య!

మార్చి 31 నాటికి ఈ సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది. రెండు నెలలో వ్యవధిలో 6 మిలియన్ల మంది ఇండియన్ యూజర్లు ఫేస్‌బుక్‌లో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. తమ యూజర్లలో 76 శాతం మంది తమ నెట్‌వర్క్‌ను మొబైల్ ఫోన్‌ల ద్వారా యాక్సిస్ చేసుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. భారత్‌లో కోటి మంది యూజర్లను చేరుకునే లక్ష్యంతో ఫేస్‌బుక్ కృషి చేస్తోందని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot