పండగ పూట ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..!!!

Posted By: Staff

పండగ పూట ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..!!!

‘దివాలీ’ సీజన్ ఆరంభమైంది.., దుకాణాల్లో సందడి వాతావరణం మొదలైంది.., ఒకటి కొంటే మరొకొటి ‘ఫ్రీ’అంటూ ప్రకటనల గుప్పుముంటున్నాయి. పండుగను శుభదినంగా భావించే భారతీయులు కొత్త వస్తువలను కోనుగోలు చేయటం అనదిగా వస్తున్న సాంప్రదాయం. టెక్ సంస్కృతి విస్తరించిన నేపధ్యంలో ‘ఎలక్ట్ర్రానిక్ మరియు సాంకేతిక పరికరాల వినియోగ అమాంతం పెరిగింది. టీవీ, మొబైల్, రీఫ్రీజరేటర్, కంప్యూటర్ వంటి పరికరాలు నిత్యవసర వస్తువులయ్యాయి.

పండుగల నేపధ్యంలో సాంకేతిక వస్తువుల పై ప్రకటిస్తున్న రాయితీలను బట్టి వాటిని విక్రయించేందుకు వినియోగదారులు శ్రద్ధ చూపుతున్నారు. దీపావళీ నేపధ్యంలో పలు ప్రముఖ బ్రాండ్లు ప్రవేశపెట్టిన ఆఫర్లు ‘వన్ ఇండియా’ పాఠకుల కోసం...

- అమ్మకాలలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతున్న ‘శ్యామ్ సంగ్’పండుగ ఆఫర్లను వినియోగదారుల ముందుంచుంది. శ్యామ్ సంగ్ స్మార్ట్ టీవీల కోనుగోళ్ల పై ‘సౌండ్ బార్ సబ్ ఊఫర్ వ్యవస్థల’తో పాటు 3డీ సీడీలను ఉచితంగా అందిస్తుంది. అదేవిధంగా ఎల్ ఈడీ, ఎల్సీడీ టీవీల పై ‘బ్లూ రే’ప్లేయర్లతో పాటు ‘డీవీడీ’ ప్లేయర్లను ఉచితంగా అందిస్తున్నారు.

- పండుగ నేపధ్యంలో ‘తోషిబా’ ల్యాప్ టాప్ పరికరాల కోనుగోళ్లపై మల్టీమీడియా 5.1 స్పీకర్ సిస్టమ్ ను ఉచితంగా అందిస్తుంది. ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘హెచ్ పీ’ పెవిలియన్ DV6, DV4 నోట్ బుక్ పరికరాల కోనుగోళ్ల పై ‘నోకియా సీ2 టచ్’ మొబైల్ ఫోన్లను ఉచితంగా అందించనుంది.
‘ఏసర్’పండుగ కోనుగోళ్ల పై రూ.2000 బహుమతులను ప్రకటించింది.

(గమనిక: పైన తెలిపిన ఆఫర్ల నిబంధనలు చెన్నై తదితర ప్రముఖ నగరాల్లో వర్తించనున్నాయి. పూర్తి వివరాలను సంబంధిత సైట్లలో తెలుసుకోవచ్చు.)

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting