‘మారథాన్’ మైలు రాయిని అధిగమిస్తుందా..!!

Posted By: Staff

‘మారథాన్’ మైలు రాయిని అధిగమిస్తుందా..!!

విదేశీ కంపెనీలు హవా కొనసాగుతన్న భారతీయ మొబైల్ మార్కెట్ సెగ్మంట్ లో.. వాటికి పోటీగా దూసుకొచ్చిన లోకల్ బ్రాండ్లు Micromax, Maxx తమ సత్తాను చాటుకున్నాయి. తమ అమ్మకాలను విస్తారంగా పెంచి విదేశీ బ్రాండ్ల దూకుడులకు కళ్లెం వేశాయి. అయితే ఈ కోవాలనే మరో లోకల్ బ్రాండ్ భారతీయ టాబ్లెట్ మార్కెట్లో రంగ ప్రవేశం చేసింది.

బెంగుళూరుకు చెందిన , EAFT Technologies, ‘Magic Tile Marathon’ పేరుతో సరికొత్త Tabletను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘Android Honeycomb OS’ తో ఈ టాబ్లెట్ రూపుదిద్దుకుంది. అయితే ఈ టాబ్లెట్ పై అంచానాలు మాత్రం జోరందుకున్నాయి.. ముఖ్యంగా ‘Apple ipod’ కి ‘Marathon’ ధీటుగా నిలుస్తుందని కంపెనీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

‘10.1 inch’ డిస్ ప్లే సామర్థ్యం కలిగిన ‘Magic Tile Marathon’ టచ్ స్క్రీన్ స్వభావంతో పని చేస్తుంది. శక్తివంతమైన 1GHz Dual Core ARM సామర్థ్యం కలిగిన ఈ ఐపాడ్ ప్రాసెసర్ అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుంది. SD external memory స్లాట్ ద్వారా మెమరీ శాతాన్ని 16 GB నుంచి 32 GBకి పెంచుకోవచ్చు. హై డెఫినిషన్ ( HD ) playback సౌలభ్యం కలిగిన ‘Marathon’ అత్యుత్తమ రిసల్యూషన్ తో నాణ్యమైన ఎంటర్ టైన్ మెంట్ అనుభూతిని మీకు కల్గిస్తుంది.

‘Magic Tile Marathon’ లో పొందుపరిచిన 1 GHz processor, Android Froyo OS,Full HD playback, GPS, Bluetooth, Wi-Fi, 3G వంటి ఫీచర్లు ప్రపంచాన్ని మీ గుప్పెట్లో ఉంచుతాయి. ఇక ధరను పరిశీలిస్తే రూ.30,000లకు ‘Magic Tile Marathon’ ఎంచుకున్న స్టోర్లలో లభ్యమవుతుంది. అత్యాధినిక హంగులతో మార్కెట్లోకి వచ్చిన మన లోకల్ బ్రాండ్ ‘Marathon’ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting