‘3డి’ ప్రపంచం రూ.10,000లకే!!!

Posted By: Prashanth

‘3డి’ ప్రపంచం రూ.10,000లకే!!!

 

ఆ మాయల ప్రపంచంలో అన్ని వింతలే.. టక్కుటమారా తంతులే, కనురెప్ప మూయాలేం.. దృశ్యాలను మరవులేం, ఒళ్లంతా గగుర్పాటు.. అంతలోనే హార్ట్ బీటు, సెకనుకో ఉత్కంఠ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. నిమిషానికో అద్భుతం అబ్బురపరుస్తుంటుంది, ముసిపూసి మారేడుకాయ చేసినంత సులువుగా దూరాన్ని దగ్గరగా.. దగ్గరను దూరంగా చూపించే ఆ 3డి లోకాన్ని మరింత చవకగా మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?, అయితే ఈ కథనాన్ని చదివేయండి మరి......

‘3డి’కంటెంట్‌ను అంతే జోష్‌తో వీక్షించాలంటే 3డి కళ్లద్దాలు తప్పనిసరని మనందరికి తెలుసు!!, గ్లాసులు సాయం లేకుండా 3డి వీడియోలను ఏమాత్రం రిథమ్ తగ్గకుండా వీక్షించవచ్చా..?, అవుననే నంటున్నారు గాడ్మీ(Gadmei) సంస్థ ప్రతినిధులు.

గత కొంత కాలంగా నిర్వీరామంగా శ్రమిస్తున్న ఈ సంస్థ రిసెర్చ్ బృందం 3డి టాబ్లెట్‌ను డెవలప్ చేసింది. ప్రత్యేకమైన కళ్లద్దాలను ధరించకుండా నేరుగా ఈ 3డి కంటెంట్‌ను వన్నెతగ్గని అనుభూతితో తిలకించవచ్చు. ఈ అసాధారణ గ్యాడ్జెట్ శక్తివంతమైన 3డి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:

* 8 అంగుళాల 3డి డిస్‌ప్లే, * ఆర్మ్ కార్టెక్స్ ఏ9 సింగిల్ కోర్ ప్రాసెసర్, * ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం, * మాలీ - 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * 8జీబి స్టోరేజి మెమరీ. * ర్యామ్ సామర్ధ్యం 512 ఎంబీ, * ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ, * ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, * హెచ్డీఎమ్ఐ పోర్ట్.

నిరుత్సాహపరిచే అంశాలు:

టాబ్లెట్‌లో హై ఎండ్ స్పెసిఫికేషన్‌లను నిక్షిప్తం చేసినప్పటికి ప్రాసెసింగ్ పవర్ లోపించింది. కేవలం సింగిల్ కోర్ ప్రాసెసర్‌ను మాత్రమే లోడ్ చేశారు.

ఇండియన్ మార్కెట్లో ‘గాడ్మీ T863’ 3డి టాబ్లెట్ ధర రూ.10,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot