'7' నెంబర్ లోనే ఉంది మా 'లక్'

By Prashanth
|
First ICS based tablet - NOVO7


టాబ్లెట్ కస్టమర్స్‌కు మరో శుభవార్త. మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే మరో కొత్త టాబ్లెట్ 'నోవో7' త్వరలో దర్శమివ్వనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కాలిఫోర్నియా మిప్స్ టెక్నాలజీని నిక్షిప్తం చేశారు. నోవో7 టాబ్లెట్ సెర్చ్ ఇంజిన్ గెయింట్ గూగుల్‌కి చెందిన 'ఆండ్రాయిడ్ వర్సన్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్'తో మార్కెట్లోకి ప్రవేశించనుంది. యూజర్స్‌కు కనువిందు చేసేందుకు గాను దీని స్కీన్ సైజు 7 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది.

'నోవో 7' టాబ్లెట్ చైనాకు చెందిన ఇన్‌జినిక్ సెమీకండెక్టర్ 'JZ4770'తో పాటు, మిప్స్ టెక్నాలజీకి చెందిన XBurst ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. దీనితో పాటు VIVANTE GC860 GPU ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేశారు. నోవో 7 టాబ్లెట్‌లో పుల్ హెచ్‌డి 1080p ఫార్మెట్‌లో వీడియోలను వీక్షించవచ్చు. 3డీ విడియో గేమ్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కస్టమర్స్‌కి నోవో 7 టాబ్లెట్ ఒక్క కెమెరా విషయంలో నిరాశకు గురి చేస్తుంది. అందుకు కారణం ఇందులో కేవలం 2 మెగా ఫిక్సల్ కెమెరా ఉండడమే.

నోవో7 టాబ్లెట్ ఫీచర్స్:

నెట్ వర్క్: 2G

డిస్ ప్లే: 7-inch multi-touch Display

ప్రాసెసర్: 1GHz single-core MIPS XBurst CPU + Vivante GC860 GPU

అప్లికేషన్స్: Browser, Pre-installed Apps, Google Apps, Android Market

కెమెరా: 2MP Rear

కెమెరా ఫీచర్స్: Flash

సెకండరీ కెమెరా: Front

మ్యూజిక్: Music player, FM Radio, Speakers, 3.5 mm jack

వీడియో ప్లేబ్యాక్: 1080P video playback

ఇంటర్నల్ మెమరీ: Yes

విస్తరించు మెమరీ: up to 32GB (micro SD)

బ్యాటరీ: Li-Ion Standard

ఆపరేటింగ్ సిస్టమ్: Android 4.0 Icecream Sandwich OS

కనెక్టివిటీ: Wi-Fi, GPS, Bluetooth, WAP

ఎంటర్టెన్మెంట్: Java, Embedded & Downloadable Games

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X