రేటు లక్షపైనే..ఎంత హాటో!!

Posted By: Prashanth

రేటు లక్షపైనే..ఎంత హాటో!!

 

ఉత్తమమైన పనితీరును కనరిచే హై స్పీడ్ ల్యాప్‌టాప్‌ను ఎమ్ఎస్ఐ సంస్థ రూపొందించింది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే దిమ్మ తిరగుతుంది. 4.16 GHz క్లాక్ స్పీడ్ వేగంతో పనిచేసే ఈ కంప్యూటింగ్ డివైజ్‌లో ఇంటెల్ హై పవర్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఎన్-విడియా హైడెఫినిషన్ గ్రాఫిక్ యూనిట్‌ వంటి శక్తివంతమైన వ్యవస్థలను నిక్షిప్తం చేశారు. ‘MSI- GT780DX’ మోడల్‌లో మార్కెట్లో లభ్యమవుతున్న ల్యాపీ ధర రూ.1,30,000లోపు...

ల్యాపీ కీలక ఫీచర్లు:

* 17.3 అంగుళాల ఉత్తమ క్వాలిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),

* డస్ట్ ప్రూఫ్ మరియు యాంటీ రిఫ్‌లెక్టివ్ స్ర్కీన్,

* ఇంటెల్ కోర్ i7 2670QM 2.2 GHz ప్రాసెసర్,

* ఎన్-విడియా జీఫోర్స్ గ్రాఫిక్ సపోర్ట్ కార్డ్,

* 16జీబి సామర్ధ్యం గల డీడిఆర్ 3 ర్యామ్,

* ఇన్‌బుల్ట్ మెమెరీ 128జీబి, హార్డ్‌డిస్క్ డ్రైవ్ సామర్ధ్యం 750జీబి,

* ఇంటెల్ సెంట్రినో N-130 వైర్‌లెస్ కనెక్టువిటీ,

* హై డెఫినిషన్ ఆడియో కంట్రోలర్,

* అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచే ఆప్టికల్ కమ్ డీవీడీ బ్లూరే డ్రైవ్,

* 2.1 ఛానల్ ఆడియో సిస్టం,

* యూఎస్బీ పో్ర్ట్స్ (2.0,3.0),

* హెచ్‌డిఎమ్ఐ పోర్టు,

* హై డెఫినిషన్ వెబ్ కెమెరా,

* బరువు 4 కేజీలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot