50 నగరాలకు ఫ్లిప్‌కార్ట్ ఇన్ ఏ డే గ్యారంటీ సర్వీసులు

|

తమ వద్ద కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఒక రోజులో డెలివరీ చేసే ఉద్దేశ్యంతో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ‘ఇన్ ఏ డే గ్యారంటీ' (In-a-Day Guarantee) పేరుతో ఓ డెలివరీ సర్వీసును ఈ ఏడాదిఆరంభంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిత ఈ సర్వీసు ఢిల్లీ, నోయిడా, ముంబయ్, చెన్నై, బెంగు‌ళూరు, పూణే ఇంకా హైదరాబాద్‌లలో అందుబాటులో ఉండేది. తాజాగా ఈ సర్వీసును మరో 43 నగరాలకు విస్తరింపజేస్తూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ తరహాలోనే అమెజాన్ ఇండియా ‘వన్ డే డెలివరీ సర్వీస్' పేరుతో ఒక రోజు డెలివరీ ప్రక్రియకు గతంలోనే శ్రీకారం చుట్టుంది.

 
 50 నగరాలకు  ఫ్లిప్‌కార్ట్ ఇన్ ఏ డే గ్యారంటీ సర్వీసులు

ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇన్ ఏ డే గ్యారంటీ' సర్వీసును సద్వినియోగం చేసుకునే వినియోగదారులు సాయత్రం 6 గంటల లోపు ఫ్లిప్‌కార్ట్ వద్ద తమ షాపింగ్‌కు సంబంధించి ఆర్డర్‌లను బుక్ చేసుకున్నట్లయితే మరిసటి రోజునే ఆ ఉత్పత్తులు వారికి పంపిణీ కాబడతాయి. ఇందుకుగాను సర్వీస్ ఛార్జ్ క్రింద రూ.90 చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ ఇన్ ఏ డే గ్యారంటీ సర్వీసు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పట్టణాల వివరాలు... కోల్‌కతా, ఆగ్రా, అహ్మదాబాద్, అజ్మీర్, అంబాలా, బతిండా, భువనేశ్వర్, చండీఘడ్, చందానగర్, కోయంబత్తూర్, దావన్‌గిరి,దుర్గాపూర్, ఏరోడ్, ఫరీదాబాద్, గోవా, గుర్గావ్, గజియాబాద్, హిస్సార్, హోసూర్, హౌరా, హుబ్లి, జైపూర్, కాంచీపురం, ఖరగ్పూర్ , కోటా, లుదియానా, మదురై, మీరుట్, నాగ్‌పూర్, నాసిక్, నావి ముంబయ్, పానీపట్, పంజిమ్ , పాటియాలా, పాండిచెర్రీ, సేలం, సింకిద్రాబాద్, థాణే, తంజావూర్, తిరువల్లూర్, తిరుప్పూర్, తిరుచిరపల్లి, వెల్లోర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X