దిగ్గజాల మధ్య ‘దమ్మున్న’పోరు!!

Posted By: Staff

దిగ్గజాల మధ్య ‘దమ్మున్న’పోరు!!

 

‘‘వినియోగదారుల సాక్షిగా దీటైన వేదిక పై ‘దమ్ము’లు చూసుకునేందుకు ఆ దిగ్గాజాలు సన్నద్ధమవుతున్నాయి.’’

టాబ్లెట్ పీసీలకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ కంపెనీలన్ని వీటి తయారీ పై దృష్టిసారించాయి. బ్రాండ్ విలువకు తోడు ఆధునికతను జోడించి వివిధ వేరింయంట్లలో ఈ అరచేతి గ్యాడ్జెట్లను విడుదల చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ సాంకేతిక పరికరాలు తయారీ సంస్థలు ‘హెచ్ సీఎల్’ (HCL), ‘ఫ్లై’ (FLY) ఆడ్వాన్సడ్ ఫీచర్లతో టాబ్లెట్ పీసీలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ‘హెచ్ సీఎల్ ME X1’, ‘Fly విజన్’ వర్షన్లలో ఈ గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి.

క్లుప్తంగా వీటి ఫీచర్లు:

- ‘ME X1’ టాబ్లెట్ పీసీ 7 అంగుళాల డిస్ ప్లేతో శక్తివంతమైన 800 x 480 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- ‘Fly విజన్’ టాబ్లెట్ పీసీ 7 అంగుళాల డిస్ ప్లేతో నాణ్యమైన రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- టచ్ స్ర్కీన్ ఆధారితంగా ఈ రెండు పీసీలు పని చేస్తాయి.

- కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే బ్లూటూత్, 802.11 b/ g/ n వైఫై, యూఎస్బీ పోర్ట్స్, మినీ హెచ్డీఎమ్ఐ అవుట్ పుట్ అంశాలు ఈ పీసీల్లో సమాన ప్రాధాన్యత కలిగి హై స్పీడ్ పనితీరును అందిస్తాయి.

- ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలకు సంబంధించి ఈ టాబ్లెట్ల పీసీలలో తేడాలను మనం గమనించవచ్చు. అధునాతన 2.3.3 ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థను ‘ME X1’లో లోడ్ చేయ్యగా, ఆండ్రాయిడ్ 2.2 ఫ్రయో ఆపరేటింగ్ వ్యవస్థను ‘Fly విజన్’ టాబ్లెట్ పీసీలో లోడ్ చేశారు.

- ప్రాసెసింగ్ అంశాలను పరిశీలిస్తే ‘హెచ్ సీఎల్ ME X1’లో 1GHz సామర్ధ్యం గల కార్టెక్స్ A8, ‘Fly విజన్’లో 600 MHz సామర్ధ్యం గల రాక్ చిప్ 2818 ప్రాసెసింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

- ర్యామ్ సామర్ధ్యాన్ని పరిశీలిస్తే ‘X1’ 512MB, ‘విజన్’ 256 MB పటిష్ట వ్యవస్థలను కలగి ఉంటాయి.

- కెమెరా అంశాలను పరిశీలిస్తే ‘హెచ్ సీఎల్ ME X1’ 2మెగా పిక్సల్ ఫ్రంట్ , ‘Fly విజన్’ 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సౌలభ్యతను కలిగి ఉంటుంది.

- బ్యాటరీ అంశాలను పరిశీలిస్తే ‘ME X1’ 3.7v 3500 mAh లితియమ్ పాలిమర్, ‘Fly విజన్’ 4000 mAh లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థలు దీర్ఘకాలిక బ్యాకప్ ను వినియోగదారుడికి అందిస్తాయి.

- మైక్రో స్లాట్ ఎస్డీ సహకారంతో ‘ME X1’ ఎక్సటర్నల్ మెమరీని 32జీబీ వరకు వృద్థి చేసుకోవచ్చు. మైక్రో స్లాట్ ఎస్డీ సహకారంతో ‘Fly విజన్’ ఎక్సటర్నల్ మెమరీ పరిమితి 16జీబీ మాత్రమే.

- చివరిగా ధర అంశాలను పరిశీలిస్తే ఇండియన్ మార్కెట్లో ‘హెచ్ సీఎల్ ME X1’ధర రూ.10,000కాగా, ‘Fly విజన్’ ధర రూ.8,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot