కంప్యూటర్ యూజర్లకు బ్రేకింగ్ న్యూస్

Posted By: Staff

 కంప్యూటర్ యూజర్లకు బ్రేకింగ్ న్యూస్

 

పర్సనల్ కంప్యూటర్ల వినియోగదారుల కోసం ఫ్రాంటెక్ సంస్థ గొప్ప ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఆధునిక సాంకేతికతో రూపొందించబడిన క్వర్టీ కీబోర్డ్+ ఆప్టికల్ మౌస్ కాంబో ప్యాక్‌ను కేవలం రూ.399కే అందిస్తుంది. కంప్యూటింగ్, మల్టీ మీడియా ఇతర గేమింగ్ అవసరాలను చకచకా నిర్వర్తించుకునేందుకు ఈ కాంబో ప్యాక్ ఉత్తమ పరిష్కారం. 3డి వైర్ సౌలభ్యతతో డిజైన్ కాబడిన ఆప్టికల్ మౌస్ సౌకర్యవంతంగా స్పందిస్తుంది.

ఫ్రాంటెక్ 1665 కీబోర్డు మౌస్ కాంబో ఫీచర్లు:

-  3డి వైర్ ఆప్టికల్ మౌస్,

-  క్వర్టీ కోబోర్డ్,

-  ఇన్‌బుల్ట్ లోవోల్లేజ్ రెసెట్,

-  కస్టమ్ మేడ్ గేమింగ్,

-  ధర రూ.399.

బ్లూటూత్ ఆధారిత మొబైల్ కీబోర్డ్:

ప్రఖ్యాత కంపెనీ మైక్రోసాఫ్ట్ మరో అద్భుతానికి తెర లేపింది. ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన బ్లూటూత్ ఆధారిత మొబైల్ కీబోర్డ్ 5000ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.3,350. ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలతో పాటు అన్ని జనరేషన్‌ల ఐప్యాడ్‌లకు ఈ కీబోర్డును బ్లూటూత్ సాయంతో అనుసంధానించుకోవచ్చు. ఈ కీబోర్డ్ ప్రత్యేక అనుకూలతలను పరిశీలిస్తే, టైపింగ్ అనుకూలమైన భంగిమలో డిజైన్ కాబడింది. ఆపరేటింగ్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంతటి పనినైనా అలుపెరగని శ్రమతో చక్కబెట్టేస్తారు.

కీబోర్డ్ ఫ్రధాన ఫీచర్లు:

- అల్ట్రా లైట్ వెయిట్,

- బరువు కేవలం 400 గ్రాములు,

- అత్యాధునిక బ్లూటూత్ టెక్నాలజీ,

- ధర రూ.3,350.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot