జపాన్‌లో ‘ఫుజిట్సు’ పీసీల విడుదలకు సన్నాహాలు..!!

By Super
|
Fujitsu

‘‘2011 అక్టోబర్ ‘13’న, జపాన్ ఓ ప్రయోగానికి వేదికగా నిలవనుంది. ప్రతిష్టాత్మక ఈ ‘ప్రయోగం’ ఎటువంటి ఫలితాన్నిస్తుందోనన్న ఉత్కంఠతో కొందరు ఎదరుచూస్తున్నారు. అచ్చమైన జపాన్ సంస్థ ‘ఫుజిట్సు’ (Fujitsu) ఉన్నత ప్రమాణాలతో రూపొందించిన ‘వింటర్ రేంజ్ కంప్యూటర్ పీసీలను’ జపాన్‌లో ఆవిష్కరించనుంది.’’

17 మోడళ్లలో బ్రాండ్ విడుదల చేస్తున్న వింటర్ రేంజ్ కంప్యూటర్లు సాంకేతిక విలువలతో పాటు అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ కాబడ్డాయి. పీసీల్లో పొందుపరిచిన ‘ఎఫ్ లింక్’ (F-LINK) ఆప్లికేషన్, ఐ ఫోన్‌లోని వీడియోలతో పాటు ఫోటోలను వైర్‌లెస్ ఆధారితంగా కంప్యూటర్‌లో స్టోర్ చేస్తుంది. మరో ‘క్విక్ స్టార్ట్ ఫీచర్’ వ్యవస్ధ, పవర్ బటన్ ప్రెస్ చేసిన 6 సెకన్ల వ్యవధిలోనే కంప్యూటర్‌ను బూట్ చేస్తుంది.

‘ఫుజిట్సు’ ఎఫ్ఎమ్‌వీ సిరీస్‌లో విడుదలవుతున్న పీసీల వివరాలు:

- ‘లైఫ్ బుక్ SH76/E’ ఈ వేరియంట్‌లో లభ్యమయ్యే పీసీలు 13.3 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. పీసీల్లో ఏర్పాటు చేసిన ‘సూపర్ మల్టీ డ్రైవ్ వ్యవస్థ’ వేగవంతమైన పనితీరును కలిగి ఉంటుంది. మన్నికైన ప్రొఫైల్, 13.7 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- ఎస్‌ప్రిమో ఎఫ్‌హెచ్ డెస్క్‌టాప్ (Esprimo FH desktop) వేరింయంట్‌లో లభ్యమయ్యే పీసీలు ‘23’ అంగుళాల మన్నికైన ఎల్‌సీడీ స్క్రీన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. పీసీల్లో అమర్చిన Onkyo ‘సౌండ్ మాస్టర్’ వ్యవస్థ డీటీఎస్ (DTS) ఆడియో అనుభూతిని కలిగిస్తుంది. ఫైన్ ప్యానల్ ఫుల్‌ఫ్లాట్ టెక్నాలజీ వ్యవస్థ నాణ్యమైన విజువల్ అనుభూతికి లోను చేస్తుంది.

- ‘లైఫ్ బుక్ ఏహెచ్’ (Lifebook AH) వేరియంట్లలో విడుదలవుతున్న AH52/EA, AH56/E, and AH77/E పీసీలు 15.6 అంగుళాల మన్నికైన ఎల్‌సీడీ స్క్రీన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ పీసీల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కీబోర్డు వ్యవస్థ కొత్త అనుభూతికి లోను చేస్తుంది.

- ధర మరియు ఇతర సంబంధిత వివరాలు ఫుజిట్సు వెబ్ సైట్లలో పొందవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X