ఫుజిట్సు నుంచి విండోస్ 8 టాబ్లెట్

Posted By: Prashanth

ఫుజిట్సు నుంచి విండోస్ 8 టాబ్లెట్

 

ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ఫుజిట్సు (Fujitsu) విండోస్ 8 ఆధారితంగా స్పందించే సరికొత్త హైబ్రీడ్ కంప్యూటింగ్ డివైజ్ ను మార్కెట్లోకి తెచ్చింది. డివైజ్ పేరు ‘స్టైలిస్టిక్ క్యూ702’(STYLISTIC Q702)ఈ బహుళ ఉపయోగకర కంప్యూటింగ్ పరికరాన్ని టాబ్లెట్ అలానే నోట్ బుక్ లా ఉపయోగించుకోవచ్చు. ధర రూ.69,000 (కీబోర్డ్ ఇతర పన్నులు కలుపుకుని).

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)

స్సెసిఫికేషన్ లు:

- విండోస్ 8 ఆపరటింగ్ సిస్టం,

- ఎల్ఈడి బాక్లిట్ ఐపీఎస్ యాంటీ-గ్లేర్ 11.6 అంగుళాల హైడెఫినిషన్ డ్యూయల్ డిజిటైజర్ మల్టీ-టచ్ డిస్ ప్లే, పెన్ ఇంకా టచ్ ఇన్ పుట్,

- కీబోర్డ్ డాకింగ్ స్టేషన్ (4 - సెల్ బ్యాటరీ), ల్యాన్ పోర్ట్ (ఆర్ జే-45) ఇంకా ఎక్సటర్నల్ డిస్ ప్లే సపోర్ట్ (వీజీఏ),

- యూఎస్బీ (2.0, 3.0), హెచ్ డిఎమ్ఐ, ఎస్ డి/ఎస్ డిహెచ్ సీ,స

- ఆప్షనల్ 3జీ/యూఎమ్ టీఎస్, 4జీ/ఎల్ టీఈ మొబైల్ బ్రాండ్ బ్యాండ్ సపోర్ట్,

- యాక్సిలరోమీటర్, గైరోమీటర్, మ్యాగ్నో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్స్,

- ఫ్రంట్ ఇంకా రేర్ ఫేసింగ్ కెమెరా.

వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎఫ్-074 3జీ’

జపాన్‌కు చెందిన బహుళ జాతి టెక్ దిగ్గజం ఫుజిట్సు, ప్రముఖ భారతీయ టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా డొకొమోతో చేతులు కలిపింది. ఈ ఇరువురి భాగస్వామ్యంతో సరికొత్త వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎఫ్-074 3జీ’మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ అల్ట్రాసిమ్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,900 ధరకు బెంగుళూరులోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో టాటా డొకొమో యూజర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

టాటా డొకొమో, ఫుజిట్సు ఎఫ్-074 3జీ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

అల్ట్రాస్లిమ్ (కేవలం 6.7మిల్లీమీటర్ల మందం),

బరువు 105 గ్రాములు,

పటిష్టమైన స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,

ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

స్ర్కీన్ సైజ్ తెలియాల్సి ఉంది,

5మెగా పిక్సల్ కెమెరా,

ప్రత్యేకతలు:

ఈ ఫోన్ తన డిస్‌ప్లే కాంతిని వాతవరణాన్ని బట్టి తనకి తానుగా సర్దుబాటు చేసుకుంటుంది.

డివైజ్‌లో ఏర్పాటు చేసిన మోషన్ కాన్సియన్ ఆడియో వ్యవస్థ ఎటువంటి పర్యావరణంలోనైనా క్లియర్ వాయస్‌ను అందిస్తుంది.

డొకొమో స్పెషల్ డేటా ప్లాన్స్:

ఈ ఫోన్ కొనుగోలు పై డొకొమో ఆకర్షణీయమైన వాయిస్ ఇంకా డేటా ప్యాకేజీలను అందిస్తోంది. ఈ సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన అన్ లిమిటెడ్ 899 జీఎస్ఎమ్ పోస్ట్‌‌పే ప్లాన్ ద్వారా యూజర్ 3జీ సామర్ధ్యం గల 1జీబి డాటాను మూడు నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, ఏ ఇతర నెట్‌వర్క్‌ల‌కైనా లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా నిర్వహించుకోవచ్చు.

యాపిల్ ఎఫెక్ట్: సామ్‌సంగ్ టాబ్లెట్ పై 6,000 తగ్గింపు!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot