‘ఫుజిట్సు’అల్ట్ర్రాతిన్ నోట్ బుక్.., ‘మీ కలలకు సాకారం’!!!

By Super
|
Fujisthu
‘‘సాంకేతిక విప్లవంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయ్.., అగ్ర శ్రేణుల మధ్య కోల్డ్ వార్ రాజుకుంటుంది.., సరికొత్త ఆవిష్కరణలతో ‘నువ్వా - నేనా’ అంటూ సాగుతున్న సాంకేతిక పోరు అంచనాలకు మించిన అద్భుతాలకు వేదికగా నిలుస్తుంది.’’

‘అల్ట్ర్రాతిన్ ల్యాపీల మార్కెట్లో దిగ్గజ కంపెనీల మధ్య పోటీ మాటను అలాఉంచితే, చాప కింద నీరులో ఓ నిశబ్ధ విప్లవం ప్రవహిస్తుంది. ప్రముఖ బ్రాండ్లకు ధీటైన సవాల్ ను విసురుతూ అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతున్న ‘ఫుజిట్సు ’(Fujitsu) వినూత్న ఆవిష్కరణలతో తన సత్తాను చాటుకుంటుంది. తాజాగా ఈ బ్రాండ్ విడుదల చేయుబోతున్న‘అల్ట్ర్రా లైట్ అల్ట్ర్రాబుక్’(ultra-light ultrabook) పరికరం ఆడ్వాన్సడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంది.

-‘ఫిజిట్సు లైఫ్ బుక్ SH76/E’గా విడుదల కాబోతున్న ఈ నోట్ బుక్ ల్యాపీ ఉన్నత ప్రమాణలతో నిర్మించబడింది.
- 13.3 అంగుళాల ‘అల్ట్ర్రా తిన్’ డిస్ ప్లే 1366*768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- ల్యాపీలో అమర్చిన ‘ఇంటెల్ కోర్ i5-2520M’ సీపీయూ వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

- 4జీబీ ర్యామ్ కు అదనంగా మరో 4జీబీని జత చేసుకోవచ్చు.

-128GB mSATA SSD స్టోరేజి సామర్ధ్యాన్ని ల్యాపీలో పొందుపరిచారు.

- ల్యాపీ బరువు కేవలం 1.34 కిలో గ్రాములు మాత్రమే.

- రెండు 2.0 యూఎస్బీ పోర్టులతో పాటు, 3.0 యూఎస్బీ పోర్టును ల్యాపీలో అనుసంధనించారు.

- గిగాబిట్ ‘ఇతర్ నెట్ పోర్టు’వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూర్చే అంశం.

- మెమరీని పెంచుకునేందుకు ‘మైక్రో ఎస్డీ కార్డ్ ను’ గ్యాడ్జెట్ లో్ ఏర్పాటు చేశారు.

- ఏర్పాటు చేసిన 72Wh six cell బ్యాటరీ వ్యవస్థ 18.2 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

- వై-ఫై కనెక్టువిటీ అప్లికేషన్ సమాచార వ్యవస్థను మరింత వేగవతం చేస్తుంది.

- అత్యాధునిక అల్ట్ర్రాతిన్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘ఫుజిట్సు లైఫ్ బుక్ SH76/E’ను ఈ నెల చివరాంకంలో జపాన్ లో విడుదల చేయునున్నారు. ఇండియన్మార్కెట్లో ఈ గాడ్జెట్ ధర రూ.93, 800 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X