‘ఫుజిట్సు’ టాబ్లెట్, సైగలతో శాసించండి

Posted By: Super

‘ఫుజిట్సు’ టాబ్లెట్, సైగలతో శాసించండి

అంతర్జాతీయ ఐటీ పరికరాల దిగ్గజం ‘ఫుజిట్సు’ (Fujitsu), సరికొత్త వాటర్ ప్రూఫ్ టాబ్లెట్లతో పాటు స్మార్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయునుంది
మన్నికైన స్పెసిఫికేషన్లతో రూపుదిద్దుకున్న వాటర్ ప్రూఫ్ టాబ్లెట్ పీసీలకు సంబంధించి క్లుప్తంగా వివరాలు...

- 10.1 అంగుళాల WXGA డిస్ ప్లే వ్యవస్థ నీటి నుంచి టాబ్లెట్ ను రక్షిస్తుంది.
- టెగ్రా 2 డ్యూయల్ కోర్ ప్రొసెసర్ లేదా TIOMAP ప్రొసెసర్ ను టాబ్లెట్ పీసీలో వాడనున్నట్లు తెలుస్తోంది.
- ఆపరేటింగ్ వ్యవస్ధకు సంబంధించి, గూగుల్ ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు V2.3.4 లేదా v2.3.5 వర్షన్లు ఉపయోగించవచ్చని సమాచారం.
- కేవలం 597 గ్రాములు బరువు కలిగి ఉండే ‘LTE F-01D’ టాబ్లెట్ 11.3mm మందం ఉంటుంది.
- టాబ్లెట్ పీసీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గెస్ట్యర్ వ్యవస్థ ఆధారితంగా చేతి సైగలతో పీసీలోని ఫీచర్లను నియంత్రించవచ్చు.
- పలు బ్రాడ్ బ్యాండ్ ఆప్లికేషన్లను పీసీలో లోడ్ చేశారు.
- హై స్పీడ్ మొబైల్ టీవీ, ఆన్ లైన్ గ్యేమింగ్ వ్యవస్థలను టాబ్లెట్ లో పొందుపరిచారు.
- 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరాను టాబ్లెట్లో ఏర్పాటు చేశారు.
- 32 జీబీల మెమరీ సామర్ధ్యం వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot