సొగసరిని.. ఓ చూపు చూస్తారా?

సొగసరి బ్రాండ్ ఫుజిట్సు ‘స్టైలిస్టిక్ M532’ మోడల్ లో 10 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ కంప్యూటర్ ను లాంఛ్ చేసింది. చమ్మ వాతావరణంలో సైతం ట్రబుల్ ఫ్రీగా పనిచేసే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దామా……
టాబ్టెట్ డిస్‌ప్లే పరిమాణం 10.1 అంగుళాలు (స్ర్కీన్ రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్), సాధారణ ప్రాసెసర్ లతో పోలిస్తే నాలుగు రెట్టు సమర్ధవంతంగా పని చేసే న్విడియా టెగ్రా 3 సిలికాన్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో బలోపేతం చేశారు. ఈ ప్రాసెసర్ క్లాక్ వేగం 2GHz. టాబ్లెట్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్పల్ కెమెరా క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. ముందు భాగంలో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా లైవ్ వీడియో ఛాటింగ్‌కు దోహదపడుతుంది. ఇంటర్నల్ మెమరీ 16జీబీ. మైక్రో యూఎస్బీ పోర్టులను డివైజ్ సైడ్ భాగంలో ఏర్పాటు చేశారు. మరిన్ని ఉపయుక్తమైన ఫీచర్లను ఈ పీసీలో దోహదం చేశారు. అతి త్వరలో విడుదల కాబోతున్న ‘ఫుజిస్టు స్టైలిస్టిక్ M532’ ధర అంచనా రూ.40,000.
స్టైలిస్టిక్ M532 కీలక ఫీచర్లు్
10 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, (క్లాక్ స్పీడ్ 1.4గిగాహెట్జ్),
1జీబీ డీడీఆర్ ర్యామ్,
16జీబి, 32జీబి ఇన్ బుల్ట్ మెమెరీ,
8మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మినీ యూఎస్బీ పోర్ట్,
హెచ్ డిఎమ్ఐ అవుట్,
9గంటల బ్యాటరీ బ్యాకప్.


Click it and Unblock the Notifications








