ఫుజిట్సు ‘సాఫ్ట్‌వేర్’ రంగానికి కొత్త శక్తి !!

Posted By: Prashanth

ఫుజిట్సు ‘సాఫ్ట్‌వేర్’ రంగానికి కొత్త శక్తి !!

 

కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశ్రమలో అగ్రగామి ఉత్పత్తులను వినియోగాదారులకు చేరువ చేస్తున్న ఫుజిట్సు (Fujitsu) సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఉన్నత ప్రమాణాలతో రూపొందించిన ‘ఫుజిట్సు SH771 లైఫ్ బుక్’ ల్యాపీని మార్కెట్లో ప్రవేశపెట్టింది. 13 అంగుళాల ఈ అల్ట్రా పోర్టబుల్ ల్యాపీ కేవలం 1.22 కిలో గ్రాములు బరువు ఉంటుంది. మన్నికైన ఫీచర్లతో స్లిమ్‌గా రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ ప్రొఫెష్‌నల్స్‌లో పూర్తి స్థాయి హుందతనాన్ని పెంచుతుంది. i7 ప్రాసెసింగ్ కాన్ఫిగరేషన్లలో డిజైన్ కాబడని ‘SH771’లో 8జీబీ ర్యామ్, 750జీబీ హార్డ్‌డిస్క్‌ను నిక్షిప్తం చేశారు. i5 ప్రాసెసింగ్ కాన్ఫిగరేషన్లో డిజైన్ కాబడిన ‘SH771’లో 4జీబీ ర్యామ్, 640జీబీ హార్డ్‌డిస్క్‌ను దోహదం చేశారు.

మరిన్ని ఫీచర్లు:

* హై డెఫినిషన్ డిస్‌ప్లే, * LED బ్యాక్‌లైట్, * స్పిల్ ప్రూఫ్ కీబోర్డు, * ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్ కార్డ్, * ఫింగర్ ఫ్రింట్ స్కానర్, * RF టెక్నాలజీ, 2.0 యూఎస్బీ కనెక్టువిటీ, * హెచ్డీఎమ్ఐ పోర్ట్సు, * ఎక్సప్రెస్ కార్డ్ స్లాట్ , * 6 సెల్ లియాన్ 67Wh బ్యాటరీ, * 3డీ షాక్ సెన్సార్, * బ్లూరే డ్రైవ్ .

సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఈ తరహా గ్యాడ్జెట్లను తమ ప్రాజెక్టుల్లో భాగంగా ఉపయోగిస్తే పని వేగం మరింత రెట్టింపవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారతీయ మార్కెట్లో త్వరలో లభ్యం కానున్న ఈ శక్తివంతమైన ల్యాపీ ధర Rs.1,00,000 ఉండొచ్చని వ్యాపార వర్గాలు అంచనావేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot