ఫైల్ ఫార్మాట్స్.. వాటి ప్రత్యేకతలు

టర్నెట్ పరిభాషలో ఫైల్ ఫార్మాట్ (File Format) అనేది ఒక స్టాండర్డ్. మన రోజువారి కంప్యూటింగ్ కార్యకలాపాల్లో భాగంగా డేటాను పైల్స్‌ రూపంలో సేవ్ చేస్తుంటాం. ఈ ఫైల్స్ అనేవి రకరకాల ఫైల్ ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంటాయి. డిజిటల్ స్టోరేజ్ మీడియమ్‌లో సమాచారాన్ని encode చేసేందుకు ఈ ఫైల్ ఫార్మాట్స్ అనేవి దోహదపడతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక్కో ఫైల్ ఫార్మాట్ ఒక్కరకమైన ప్రోగ్రామింగ్‌..

సింపుల్‌గా చెప్పాలంటే File Format అనేది ఒక ఫైల్‌కు సంబంధించిన లేఅవుట్. ఈ ఫైల్‌లో ముందుగా డిజైన్ చేసిన దాని ప్రకారం డేటా ఒక క్రమపద్ధతిలో ఆర్గనైజ్ కాబడి ఉంటుంది. ఒక్కో ఫైల్ ఫార్మాట్ ఒక్కరకమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఆధారంగానే డేటాను గుర్తించి యాక్సెస్ చేసుకోగలుగుతాం. .doc, .mp3, .pdf ఇలా రకరకాల ఫైల్ ఫార్మాట్స్ విస్తృతంగా వినియోగించబడుతున్నాయి. రకరకాల ఫైల్ ఫార్మాట్స్ అలానే వాటి ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం...

JPG

JPG అనేది ఫోటో ఫైల్ ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో ఫోటోలను సేవ్ చేసుకోవటంతో పాటు ఇతర ఫైల్ ఫార్మాట్‌లలోని ఫోటోలను JPGలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్‌లో ఫోటోలను మరింత బెటర్ క్వాలిటీతో కంప్రెస్ చేసుకోవచ్చు. ఫోటోలోని టోన్ అలానే కలర్‌‌కు స్మూత్ వేరియేషన్స్‌ను JPG ఫార్మాట్ అద్దుతుంది.

‌GIF

ఈ ఫైల్ ఫార్మాట్‌ను ఎక్కువుగా వెబ్ గ్రాఫిక్స్‌లో ఉపయోగిస్తున్నారు. కలర్స్‌ను బట్టి ఈ ఫైల్ సైజ్ ఆధారపడి ఉంటుంది. ‌GIF ఫార్మాట్‌లో అనేక సీక్వెన్సులతో కూడిన gif యానిమేషన్ ఉంటుంది, పిక్సల్ బేసిడ్ ఫార్మాట్‌ను GIF ఫైల్ వినియోగించుకుంటుంది.

PNG

JPG/GIF ఫైల్ ఫార్మాట్‌లకు ప్రత్యామ్నాయంగా PNG ఫైల్ ఫార్మాట్‌‌ను వినియోగించటం జరుగుతోంది. ఫోటోలను క్రియేట్ చేసేందుకు ఈ ఫార్మాట్‌ను విస్తృతంగా వినియోగించటం జరుగుతోంది. deflation అనే ప్రత్యేకమైన డేటా కంప్రెషన్ పద్ధతిని ఈ ఫైల్ ఫార్మాట్ ఉపయోగించుకుంటోంది. JPEG ఫార్మాట్‌లో స్టోర్ చేసే ఫోటోలు కంటే PNG ఫార్మాట్‌లో స్టోర్ చేసే ఫోటోలు మరింత షార్ప్‌గా ఉంటాయి.

MP3

మ్యూజిక్ ఫైల్స్‌ను కంప్రెస్ చేసేందుకు విస్తృతంగా వినియోగిస్తోన్న ఫైల్ ఫార్మాట్‌లలో MP3 (MPEG-1 Audio Layer-3) ఫైల్ ఫార్మాట్ ఒకటి. ఎంపీ3 ఫార్మాట్‌లో భాగంగా పెద్దపెద్ద ఆడియో ఫైల్స్‌ను సైతం చిన్నగా కంప్రెస్ చేసుకుని అదే సమయంలో సౌండ్ క్వాలిటీ తగ్గకుండా చూసుకోవచ్చు. మూవింగ్ పిక్షర్ ఎక్స్‌పర్ట్స్ గ్రూప్ MP3ని వెలుగులోకి తీసుకువచ్చింది.

MP4

MP4 ఫైల్ ఫార్మాట్‌లో భాగంగా ఆడియో, వీడియో డేటాను స్టోర్ చేసుకునే వీలుంటుంది. ఈ కంటైనర్ ఫార్మాట్‌కు ఏ విధమైన కోడింగ్‌ పద్థతి ఉండదు.

Flac

ఫ్లాక్ (ఫ్రీ‌ లాస్‌లెస్ ఆడియో కోడెక్ ఫైల్), ఈ ఓపెన్ సోర్స్ ఆడియో కంప్రెషన్ ఫార్మాట్ ద్వారా ఆడియో ఫైల్‌ను ఒరిజనల్ సైజ్‌ నుంచి మరింత తక్కువకు కంప్రెస్ చేసుకునే వీలుంటుంది.

PDF

పీడీఎఫ్ (పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్), ఈ ఫైల్ ఫార్మాట్ ప్రింటెడ్ డాక్యుమెంట్‌కు అవసరమైన అన్నిరకాల ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. ఈ పైల్‌ను చూడొచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు.

Doc

ఈ డాక్యుమెంట్ ఫైల్ ఫార్మాట్‌ను మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఉపయోగిస్తున్నారు. ఈ ఫైల్
ఫార్మాట్‌‌లో ఫార్మాట్‌ చేయబడి టెక్స్ట్, ఇమేజెస్, టేబుల్స్, గ్రాఫిక్స్, చార్ట్స్, పేజ్ ఫార్మాటిగ్, ప్రింట్ సెట్టింగ్స్ అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Functions of different file format explained. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot