‘ఫ్యూషన్ గ్యారేజ్’ ఓ విప్లవాత్మక టాబ్లెట్..!!

Posted By: Staff

‘ఫ్యూషన్ గ్యారేజ్’ ఓ విప్లవాత్మక టాబ్లెట్..!!

టాబ్లెట్ మార్కెట్‌ను ఓ విప్లవం మార్చబోతుంది. సైగలతో శాసించే టాబ్లెట్ ఒకటి రూపుదిద్దకుంది. ‘ఫ్యూషన్ గ్యారేజ్’ (FUSION GARAGE)గా అవతారమెత్తిన ‘ట్యాబ్‌కో’ (TabCo) , ‘గ్రిడ్ 10 పేరు’ (Grid 10) తో వినూత్న టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేయుబోతుంది. ఈ తాజా పరిణామాలతో టాబ్లెట్ మార్కెట్ సెగ్మంట్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవటం ఖాయమని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు.

‘‘ప్రటిక్టివ్ ఇంటెలీజన్స్’’ (Predictive Intelligence) అనే సరికొత్త అధునాతన వ్యవస్థను ఈ టాబ్లెట్‌లో రూపొందిచడం వల్ల అంచనాలు భారీ స్థాయిలో ఊపందుకున్నాయి. ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ వ్యవస్థతో ఆధారితంగా పనిచేసే ఈ టాబ్లెట్ మార్కెట్లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

‘ఫ్యూషన్ గ్యారేజి’ సరికొత్త వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్‌కు ‘కీ బోర్డు’ అవసరం లేదు. ఈ టాబ్లెట్‌లో పొందుపరిచిన యూజర్ ఇంటర్ ఫేస్ (UI) మీ హావభావాల ద్వారా కధను నడిపిస్తుంది. అంటే మీ కదిలికలను బట్టి ఈ టాబ్లెట్ పనిచేస్తుంది. కేవలం టాబ్లెట‌ను ఆన్ లేదా ఆఫ్ చేయటానికే మాత్రమే బటన్ ఉంటుంది. మిగిలినవి అన్ని మీ కదిలికలను బట్టే జరిగిపోతాయి. పూర్తిగా వినియోగదారుని కదిలికలు, హావభావాల పై ఆధారపడి పనిచేసే ఈ డివైజ్‌ను యాక్సిస్ చేయాలంటే వినియోగదారుని ‘సంతకం’ కావల్సి ఉంటుంది.

‘గ్రిడ్ 10’లో పొందుపరిచిన ‘ప్రిడిక్టివ్ ఇంటెలీజన్స్’ వ్యవస్థ బజ్ రికమండేషన్ ఇంజన్ల సహకారంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలోని ప్రత్యేకత, మీరు క్యాలెండర్‌లో ఫీడ్ చేసుకున్న ఆపాయింట్‌మెంట్ అంశాలకు సంబంధించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. అంతే కాదు మీరు నిర్ధేశిత సమయంలో గమ్యస్థానానికి చేరుకునేందుకు సులువైన మార్గాలను మీకు నిర్థేశిస్తుంది. ఇంకా చాలా ప్రత్యేకతలు ఈ టాబ్లెట్‌లు ఒదిగి ఉన్నాయి. ఆహారం తీసుకునే విషయంలో వెబ్ ఆధారితంగా మీకు మంచి రెస్టారెంట్లను సూచిస్తుంది.

ఈ వినూత్న వ్యవస్థతో రూపొందించబడ్డ ‘గ్రిడ్ 10’ సామాజిక నెటవర్కింగ్ సైట్లయిన ఫేస్ బుక్, ట్విట్టర్‌లు తాజా గణాంకాలను మీ ముందు ఉంచుతుంది. ఇంత ప్రత్యేకత ఉన్న వ్యవస్థను రెండు వేళ్ల కదలికలతో నడిపించవచ్చు. టాబ్లెట్‌లో ఒదిగి ఉన్న అవుట్ స్టాండింగ్ రిసల్యూషన్ 1366 x 768 సామర్థ్యం కలిగి 16:9 రేషియోతో అద్భతమైన డిస్‌ప్లే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

న్విడియా టెగ్రా II 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రొసెస్సింగ్ వ్యవస్ధతో రూపుదిద్దుకున్న ‘గ్రిడ్ 10’ టాబ్లెట్ వై- ఫై, 3జీ వై - ఫై కంపేటబుల్ మోడళ్లలో లభ్యమవుతున్నాయి. వీటి మార్కెట్ ధరలను పరిశీలిస్తే రూ.29,000 వరకు ఉండొచ్చని అంచనా. అయితే వీటిని త్వరలో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting