మాస్ కోసం ‘జీ-ఫైవ్’..?

Posted By: Super

మాస్ కోసం ‘జీ-ఫైవ్’..?

ఆధునిక యుగమని చెప్పుకుంటున్న నేటి యాంత్రిక జీవితాల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ‘సెన్స్ అండ్ టెక్నాలజీ’ సౌలభ్యతలను కేవలం ఉన్నత శ్రేణులు మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఆర్ధికంగా వెనుకబడి ఉంటడం కారణంగా సామాన్య, దిగువ తరగతి ప్రజానీకం సాంకేతికతను అందుకోలేకపోతున్నారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ చైనా సాంకేతిక పరికరాల తయారీదారు ‘జీ -5’(G’Five) అత్యాధునిక సాంకేతిక పరికరాలాను సమంజసమైన ధరలకు సామాన్య, మధ్య తరగతి వినియోగదారులకు చేరవ చేసే విధంగా, చెన్నై సంస్థ మునాత్ గ్రూప్ ( Munoth Group)తో సంయుక్త ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పటికే భారతీయ ‘మొబైల్’ మార్కెట్లో ట్రెండ్ సెట్టర్ ను క్రియోట్ చేసిన ‘జీఫైవ్’ తాజాగా ల్యాప్ టాప్ పరికరాలతో పాటు టాబ్లెట్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వీటి ధరలు రూ. 2000 నుంచి రూ.16,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

‘మునోత్ జీఫై టెలికామ్ లిమిటెడ్’ సంయుక్త ఒప్పందంతో అక్టోబర్ చివరినాటికి 10 అత్యుత్తమ సాంకేతిక గ్యాడ్జెట్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నార్త్ అమెరికా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు ‘జీఫైవ్’ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot