యాపిల్‌తో సామ్‌సంగ్ ‘ఢీ’

Posted By:

దిగ్గజ టెక్ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, యాపిల్‌ల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఈ ఫైర్ బ్రాండ్‌లు పోటోపోటిగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. యాపిల్ తాజాగా 9.7అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో 16జీబి వై-ఫై వర్షన్ ‘ఐప్యాడ్ మినీ'ని దేశీయ విపణిలో ఆవిష్కరించింది.

మరోవైపు సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 311 పేరుతో చవక ధర వైఫై వర్షన్ ట్యాబ్లెట్‌ను పరిచయం చేసింది. వీటి ధరలను పరిశీలించినట్లయితే యాపిల్ ఐప్యాడ్ మినీ 16జీబి వేరియంట్ ధర రూ.21,900, 32జీబి వేరియంట్ ధర రూ.26,900. 63జీబి వేరియంట్ ధర రూ.31,900.

ఇక గెలాక్సీ ట్యాబ్ 2 311 విషయానికొస్తే సామ్‌సంగ్ ఈ-స్టోర్ డివైజ్‌ను రూ.13,900కు ప్రీఆర్డర్ పై విక్రయిస్తోంది. ఈ రెండు గాడ్జెట్‌ల ఎంపికకు సంబంధించి వినియోగదారుకు అవగాహన కలిగించే క్రమంలో ఇరు ట్యాబ్లెట్‌ల ఫీచర్ల పై తులనాత్మక అంచనా....

యాపిల్‌తో సామ్‌సంగ్ ‘ఢీ’

బరువు ఇంకా చుట్టుకొలత......
గెలాక్సీ ట్యాబ్ 2 311: చుట్టుకొలత 193.7 x 122.4 x 10.5మిల్లీమీటర్లు, బరువు 341 గ్రాములు,
యాపిల్ ఐప్యాడ్ మినీ: చుట్టుకొలత 200 x 134.7 x 7.2మిల్లీ మీటర్లు, బరువు 308 గ్రాములు,

డిస్‌ప్లే....
గెలాక్సీ ట్యాబ్ 2 311: 7 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
యాపిల్ ఐప్యాడ్ మినీ: 7.9 అంగుళాల ఎల్ఈడి-బాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్,

ప్రాసెసర్.....
గెలాక్సీ ట్యాబ్ 2 311: 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
యాపిల్ ఐప్యాడ్ మినీ: 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ5 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం........
గెలాక్సీ ట్యాబ్ 2 311: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేక ఫీచర్లు: ప్రాజెక్ట్ బట్టర్, కాంట్రిక్టబుల్ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, గూగుల్ నౌ),
యాపిల్ ఐప్యాడ్ మినీ: ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం (200 సరికొత్త ఫీచర్లు, యాపిల్ మ్యాప్స్, మెరుగుపరచబడిన సిరీ అప్లికేషన్, సరికొత్త సఫారీ అప్లికేషన్, ఐక్లౌడ్ స్టోరేజ్..)

కెమెరా......
గెలాక్సీ ట్యాబ్ 2 311: 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
యాపిల్ ఐప్యాడ్ మినీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్.......
గెలాక్సీ ట్యాబ్ 2 311: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
యాపిల్ ఐప్యాడ్ మినీ: ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512 ఎంబి ర్యామ్,

బ్యాటరీ......
గెలాక్సీ ట్యాబ్ 2 311: 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
యాపిల్ ఐప్యాడ్ మినీ: 16.3 డబ్ల్యూహెచ్ఆర్ లై-పో బ్యాటరీ (10 గంటల బ్యాకప్),

ధర......
గెలాక్సీ ట్యాబ్ 2 311: సామ్‌సంగ్ ఈ-స్టోర్ డివైజ్‌ను రూ.13,900 ధరకు ప్రీ ఆర్డర్ పై అందిస్తోంది,
యాపిల్ ఐప్యాడ్ మినీ: 16జీబి వేరియంట్ ధర రూ.21,900, 32జీబి వేరియంట్ ధర రూ.26,900. 63జీబి వేరియంట్ ధర రూ.31,900

తీర్పు....
పెద్దదైన డిస్‌ప్లే, అత్యుత్తమ కెమెరా టెక్నాలజీ, మెరుగైన స్టోరేజ్ ఆప్షన్స్ ఇంకా ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లు ఐప్యాడ్ మినీలో పుష్కలంగా ఉన్నాయి. మరో వైపు గెలాక్సీ ట్యాబ్ 2 311 మధ్య ముగింపు స్పెసిఫికేషన్‌లను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరను కలిగి ఉంది. వీటి ఎంపికకు సంబంధించి అంతిమ నిర్ణయాన్ని వినియోగదారే తీసుకోవల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot