వారికి ముందరన్ని మంచి రోజులే!!

Posted By: Prashanth

వారికి ముందరన్ని మంచి రోజులే!!

 

శామ్‌సంగ్ అభిమానులు తమ కలలను సాకారం చేసుకునే సమయం దగ్గరపడింది. ఎన్నో ఎదురుచూపుల మధ్య గెలక్సీ టాబ్లెట్ 2 ఇండియాలో విడుదల కానుంది. ఏప్రిల్ నాటికి ఈ సొగసరి కంప్యూటింగ్ డివైజ్ మార్కెట్లో లభ్యం కానుంది. డివైజ్ ప్రధాన ఫీచర్లను పరశీలిస్తే: ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1జిగాహెడ్జ్ ప్రాసెసర్, 7 అంగుళాల టచ్ స్ర్కీన్, 1జీబి డీడీఆర్2 ర్యామ్, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, 3మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, జీపీఎస్ ఫెసిలిటీ, హెచ్ఎస్ పీఏ

శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 2లో నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అదే విధంగా 1జీబి డీడీఆర్2 ర్యామ్ వ్యవస్థలు డివైజ్ పనితీరును పటిష్టపరుస్తాయి. నిక్షిప్తం చేసిన ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ అపరేటింగ్ సిస్టంతో మల్టీపుల్ అప్లికేషన్లను ఒకే సారి రన్ చేసుకోవచ్చు.

పీసీలో నిక్షిప్తం చేసిన ప్లేన్ టూ లైన్ స్విచ్చింగ్ (పీఎల్ఎస్) టెక్నాలజీ డిస్‌ప్లే సామర్ధ్యాన్ని రెట్టింపు చేయ్యటంతో పాటు విజువల్ అనుభూతిని మెరుగుపరుస్తుంది. 3జీ కనెక్టువిటీ సాయంతో నెట్ బ్రౌజింగ్‌ను వేగవంతంగా నిర్వహించుకోవచ్చు. ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. పీసీ ముందు భాగంలో ఏర్పాటు చేసని వీజీఏ ఫ్రంట్ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు తోడ్పడుతుంది. భిన్న మెమరీ వేరియంట్‌లలో టాబ్లెట్ లభ్యం కానుంది. వాటి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఎప్రిల్ నాటికి ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో శామసంగ్ గెలక్సీ ట్యాబ్ 2 లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot