రూ.8,000కే సామ్‌సంగ్ ట్యాబ్లెట్..?

Posted By:

రూ.8,000కే సామ్‌సంగ్ ట్యాబ్లెట్..?
సరికొత్త ట్యాబ్లెట్ కంప్యూటర్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్న సామ్‌సంగ్ త్వరలో చవక ధర ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ 3ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని డిగిటైమ్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసూస్ రూపొందించిన గూగుల్ నెక్సస్7కు ఈ ట్యాబ్లెట్‌ను పోటీగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. పలు అనధికారికి నివేదికల ద్వారా సేకరించిన వివరాల మేరకు సామ్‌సంగ్ 7 అంగుళాల ట్యాబ్లెట్ ధర $149 నుంచి $199లోపు ఉండొచ్చు. ఇండియన్ మారకం ప్రకారం ఈ ధర రూ.8,000 నుంచి రూ.11,000 మధ్య ఉంటుంది.

ఈ ఏడాది తొలి త్రైమాసికానికి గాను సామ్‌సంగ్ 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో ఓ ట్యాబ్లెట్ పీసీతో పాటు మరిన్ని కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. యాపిల్ ట్యాబ్లెట్‌ల ఆవిష్కరణకు ముందే ఈ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నారు. తాజా నివేదికల మేరకు 7.9 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో రూపుదిద్దుకుంటున్నయాపిల్ ఐప్యాడ్ మినీ ధర $250 నుంచి $300 మధ్య ఉండొచ్చని ఓ అంచనా. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.14,000 నుంచి రూ.16,500 మధ్య ఉంటుంది.

సామ్‌సంగ్ 7 అంగుళాల ట్యాబ్లెట్ ‘గెలాక్సీ ట్యాబ్ 3' స్సెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అనధికారిక సమాచారం మేరకు ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు...

- డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
- 512ఎంబి లేదా 1జీబి ర్యామ్,
- 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
- వై-ఫై ఇంకా 3జీ వేరియంట్ లలో ఈ డివైజ్ లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot