‘మే’ హిట్లు (ఫోటో గ్యాలరీ)!

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

milagrow-tabtop-7-4-02

milagrow-tabtop-7-4-02

gotech-funtab

gotech-funtab

samsung-galaxy-2-10-1

samsung-galaxy-2-10-1

mercury-ixa-tab

mercury-ixa-tab

kloudpad

kloudpad
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

ఆండ్రాయిడ్ ఆపరేటంగ్ సిస్టం పుణ్యమాఅంటూ పలు ఇండియన్ బ్రాండ్లు టాబ్లెట్ పీసీలను రూ.5,000 దిగువ ధరకే విక్రయిస్తున్నాయి. భిన్నమైన ఫీచర్లతో లభ్యమవుతున్న వీటికి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ‘మే’లో పరిచయమై ఉత్తమ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లుగా గుర్తింపుతెచ్చుకున్న 5 టాబ్లెట్ పీసీల వివరాలు వాటి ధరలు ఫోటోగ్యాలరీ రూపంలో....

మిలాగ్రో:

ఈ సంస్థ మిలాగ్రో టాబ్ టాప్ 7.4పేరుతో రెండు వేరియంట్‌లలో టాబ్లెట్ పీసీని విడుదల చేసింది. వీటిలో మొదటి రకం 4జీబి(ధర రూ.10,990) మెమరీది కాగా రెండవ రకం 64జీబి (ధర రూ.13,990). ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా ఈ డివైజ్‌లు రన్ అవుతాయి. 1.2గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‌తో ఇవి రన్ అవుతాయి. 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 500జీబి ఎక్సటర్నల్ హార్డ్‌డిస్క్.

In English

గోటెక్ ఫన్ టాబ్:

ఈ గ్యాడ్జెట్ స్ర్కీన్ పరిమాణం 7 అంగుళాలు (రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్), 800మెగాహెడ్జ్ ప్రాసెసర్, 256ఎంబీ ర్యామ్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. ధర రూ.3,999.

మెర్క్యురీ ఐఎక్స్ఏ టాబ్:

కోబియన్ సంస్థచే రూపొందించబడిన ఈ టాబ్లెట్ పీసీ ధర రూ. 4,000. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆధారితంగా రన్ అవుతుంది. 7 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్. మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. ర్యామ్ సామర్ధ్యం 512ఎంబీ.

క్లౌడ్ ప్యాడ్:

ఈ కంప్యూటింగ్ డివైజ్ 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌ను లోడ్ చేశారు. ప్రాసెసర్ సామర్ధ్యం 1.2గిగాహెడ్జ్. విద్యా అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన పలు అప్లికేషన్‌లను టాబ్లెట్‌లో ఇన్‌బుల్ట్ చేశారు. ధర రూ.10,000.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 10.1 పీ5100:

10.1 అంగుళాల టచ్‌‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

3.15 మెగాపిక్సల్ కెమెరా,

1జీబి ర్యామ్,

స్టోరేజ్ సామర్ద్యం 16జీబి, 32జీబి.

ధర రూ.19,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot