గేమింగ్ టాబ్లెట్ ‘2012’.. ఓ వింత అనుభూతి..!!

Posted By: Super

గేమింగ్ టాబ్లెట్ ‘2012’.. ఓ వింత అనుభూతి..!!

‘‘సాంకేతిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఎదుగుదలతో వీడియో గేమింగ్ వ్యవస్థ మరింత వృద్ధి చెందింది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఒళ్లుగగుర్పాటుకులోను చేసే వీడియో గేమ్ సంస్కృతి ఇప్పుడు టాబ్లెట్ పీసీలలోకి విస్తరించనుంది. ప్రముఖ వీడియో గేమ్ రిటైలర్ ‘గేమ్ స్టాప్’ (Gamestop) 2012లో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతోంది.

‘‘ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకునే ఈ అత్యాధునిక గేమింగ్ టాబ్లెట్ పీసీ, నిన్టెండో, మైక్రోసాఫ్ట్, సోని, ఆపిల్ వంటి దిగ్గజ శ్రేణులకు పోటీగా నిలువనుంది. ఈ అంశం పై ‘గేమ్ స్టాప్’ అధ్యక్షుడు టోని బార్టెల్ మాట్లాడుతూ ‘2012’లో తాము ప్రవేవపెట్టబోతున్న గేమింగ్ టాబ్లెట్ పీసీ అత్యాధునిక గేమింగ్ పీచర్లతో రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నారు.’’

‘‘గేమింగ్ ప్రియులకు మరింత లబ్ధిని చేకూర్చే ఈ టాబ్లెట్ పీసీ ఇతర ఫీచర్లు తెలియచేసేందకు బార్టెల్ నిరాకరించారు. అయితే అందివచ్చని విశ్వసనీయ వర్గాల సమాచేరం మేరకు జీపీయూ పవర్ హౌస్ వ్యవస్థను ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. గేమింగ్ అనుభూతిని మరింత ఉత్సకతతో పొందేందుకు టాబ్లెట్ పీసీలో పొందుపరిచిన వైర్‌లెస్ వ్యవస్థ ఆధారితంగా టీవీలతో పాటు ఇతర మోనిటర్లకు అనుసంధానం చేసుకోవచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot