ఇన్స్‌పాన్ వారి జీనియస్ ‘పెన్’ టాబ్లెట్స్!!

Posted By: Super

ఇన్స్‌పాన్ వారి జీనియస్ ‘పెన్’ టాబ్లెట్స్!!

 

ఐటీ సెక్టార్లో అంతర్జాతీయంగా దూసుకుపోతున్న ఇన్స్‌పాన్ ఇన్ఫోటెక్ సంస్థ పెన్ టాబ్లెట్ల నిర్మాణం పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే G-Pen F 350, EasyPen M506, G-Pen M712X, EasyPen M610X, MousePen i608X వేరియంట్లలో పెన్ టాబ్లెట్లను విడుదలచేయునున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

క్లుప్తంగా వీటి ఫీచర్లను పరిశీలిస్తే:

- జీపెన్ F 350 స్లిమ్ ఆకృతిలో డిజైన్ కాబడింది. గ్యాడ్జెట్ పరిమాణం 3 x 5 అంగుళాలు, వుబంటూ లేదా విండోస్ వ్యవస్థను ఈ టాబ్లెట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. యూఎస్బీ ఇంటర్ ఫేస్ సామర్ధ్యం, ధర రూ.3,200.

-‘ఈజీ పెన్ M506’ స్లిమ్ ఆకృతిలో డిజైన్ కాబడింది. వర్కింగ్ పరిమాణం 5 x 6 అంగుళాలు, ఈ టాబ్లట్లో ఏర్పాటు బటన్ వ్యవస్థ వినయోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్, Erase, Undo వంటి ప్రత్యేక ఆప్షన్లను

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బరువు 420 గ్రాములు, ఒత్తిడి సున్నితత్వం (ప్రెషర్ సెన్సిటివిటీ) 1024, టాబ్లెట్ పూర్తి పరిమాణం 27.9 x 19.76 x 0.9 అంగుళాలు, ధర రూ.6,260.

-‘జీ పెన్ M712X’ టాబ్లెట్ మల్టీ మీడియా సౌలభ్యతను కలిగి ఉంటుంది. 12 x 7 అంగుళాల డ్యూయల్ మోడ్ స్పెసిఫికేషన్, 4, 000 lpi రిసల్యూషన్, యూఎస్బీ ఇంటర్ ఫేస్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ పీసీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విండోస్ 7, విండోస్ 2000, విస్టా, ఎక్సపీ, మ్యాకిన్టోష్ ఆపరేటింగ్ వ్యవస్థలకు ఈ పరికరం అనుకూలం.

-‘ఈజీ పెన్ M610X’ పని విస్తీర్ణం 6 x 10 అంగుళాలు. ఈజీ ప్రోగ్రామింగ్ కు సహకరించే విధంగా నాలుగు ఎక్సప్రెస్ ‘కీ’లను టాబ్లెట్లో రూపొందించారు. CD/DVD-ROM డ్రైవ్ సౌలభ్యత, ధర రూ.6600.

-‘మౌస్ పెన్ i608X’ గ్రాఫిక్ సౌలభ్యత కలిగిన టాబ్లెట్ పీసీ, దీని పని విస్తీర్ణం 6 x 8 అంగుళాలు, ఒత్తిడి సున్నితత్వం (ప్రెషర్ సెన్సిటివిటీ) 1024, ధర రూ.3699.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot