‘అదుర్స్’ అంటారు!!

Posted By: Prashanth

‘అదుర్స్’ అంటారు!!

 

అదుర్స్ అనిపించేలా ఎల్‌జీ ఓ సరికొత్త నోట్‌బక్‌ను డిజైన్ చేసింది. పేరు ఏ530-డి ఎల్‌సీడి నోట్‌బుక్. ఈ అద్భుతమైన కంప్యూటింగ్ గాడ్జెట్ మీరు ముందెన్నడూ చూడని 3డి అనుభూతులను రుచి చూపిస్తుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన 15.6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 3డి LCD అబ్బురపరిచే విజువల్స్‌ను డిస్‌ప్లే చేస్తుంది. నోట్‌బుక్ ముందు భాగంలో అమర్చిన 3డి వెబ్‌క్యామ్ వీడియోలను అత్యుత్తమ హైడెఫినిషన్ క్వాలిటీతో బంధిస్తుంది. ఈ ఫ్రంట్ కెమెరా సాయంతో అంతరాయంలేని ప్రత్యక్ష ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు.

ఎల్‌జీ ఏ530-డి ఫీచర్లు:

- స్టైలిష్ మెటాలిక్ లుక్,

- 2డి కంటెంట్‌ను 3డిలోకి మార్చుకునే సౌలభ్యత,

- వేగవంతమైన బూటింగ్,

- ఐసోలేటెడ్ కీబోర్డు,

- ఫింగర్ ఫ్రింట్ సెన్సార్,

- బ్లూటూత్ 3.0.

డివైజ్ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

15.6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 3డి స్ర్కీన్,

4జీబి ఇంటర్నల్ ర్యామ్,

640 జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,

జీఎఫ్ జీటీ 555ఎమ్ 1జీబి గ్రాఫిక్ కార్డు,

మన్నికైన బ్యాకప్ నిచ్చే 6 సెల్ బ్యాటరీ,

గిగాబిట్ ల్యాన్,

వై-ఫై,

బ్లూటూత్ 3.0 కనెక్టువిటీ,

1.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్.

ఇండియన్ మార్కెట్లో ఎల్ జీ A530-D ధర రూ.66,780.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot