‘జీఫైవ్’, విండోస్ టాబ్లెట్లు విడుదలకు సన్నాహాలు!!

Posted By: Super

‘జీఫైవ్’, విండోస్ టాబ్లెట్లు విడుదలకు సన్నాహాలు!!

మొబైల్ మరియు హ్యాండ్ సెట్ల మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చైనా బ్రాండ్ ‘జీ ఫైవ్’ టాబ్లెట్ పీసీల మార్కెట్లోకి అడుగుపెట్టునుంది. 7, 10 అంగుళాల వేరియంట్లలో రెండు అత్యాధునిక టాబ్లెట్ పీసీలను ఏ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు ‘జీఫైవ్’ కసరత్తులు చేస్తుంది.

విండోస్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులను మెప్పించే క్రమంలో జీఫైవ్ ‘విండోస్ 8’, ‘ఆండ్రాయిడ్’ ఆపరేటింగ్ వ్యవస్థలను ఈ టాబ్లెట్లలో ప్రవేశపెట్టింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ ఆధారితంగా ఈ గ్యాడ్జెట్లు పని చేస్తాయి.

టాబ్లెట్లలో పొందుపరిచిన 3జీ మరియు వై-ఫై కనెక్టువిటీ అంశాలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. 20 సినిమాలతో పాటు 1000 గ్యేమ్‌ల సామర్ధ్యం కలిగిన 4GB SD cardను అదనపు ఫీచర్‌గా పొందపరచవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్‌లో విడుదలవుతున్న ఈ గ్యాడ్జెట్లకు సంబంధించి ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot